పోటెత్తిన గోదావరి: యానాంను ముంచెత్తిన వరద నీరు

By narsimha lode  |  First Published Jul 17, 2022, 11:09 AM IST

గోదావరి వరద నీరు యానాం పట్టణాన్ని ముంచెత్తాయి. 1986 తర్వాత తొలిసారిగా యానాంలో వరద నీరు చేరింది. భారీగా వరద నీరు గోదావరికి రావడంతో యానాంలోకి వరద నీరు చేరిందని అధికారులు చెబుతున్నారు. 
 


యానాం: Godavari వరద నీరు యానాం పట్టణాన్ని ముంచెత్తింది. Yanam  పట్టణంలో తొలిసారిగా Flodd నీరు చేరింది. 1986 తర్వాత తొలిసారిగా యానాంలోకి వరద నీరు చేరింది. Dowleswaramనుండి సముద్రంలోకి  వరద నీరు వచ్చే మార్గంలో యానాం

ధవళేశ్వరం నుండి గోదావరి నీరు సముద్రంలోకి వెళ్లే సమయంలో యానాంకి సమీపంలోని ఎదురులంక నుండి వరద నీరు వచ్చి చేరుతుందని స్థానికులు చెబుతున్నారు.  యానాం పట్టణంలోని  పలు కాలనీల్లో వరద పోటెత్తింది. గ్రౌండ్ ఫ్లోర్ లోని ఇళ్లలో నీరు చేరింది. మొదటి అంతస్తులో ముంపు బాధిత ప్రజలు తలదాచుకుంటున్నారు.ధవళేశ్వరం  వద్ద గోదావరి 25 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలో  యానాం పట్టణానికి వరద నీరు వచ్చిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. తమకు వరద భయం లేదని ధీమాగా ఉన్న యానాం వాసులు కూడా  వరదతో ఇబ్బంది పడుతున్నారు. వరద ముంపు ప్రజలను NDRF సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పడవల సహాయంతో ముంపు ప్రజలను  సురక్షిత ప్రాంతాలకు రెస్క్యూ టీమ్ పంపుతున్నారు. 

Latest Videos

భారీ వరదలు వచ్చిన సమయంలో కూడా యానాం పట్టణానికి వరద రాలేదు. అయితే ఈ దఫా గోదావరికి ఊహించని రీతిలో వరద పోటెత్తడంతో యానాం పట్టణంలో వరద వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ముంపు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.

Andhra Pradesh రాష్ట్రంలోని గోదావరి పరివాహక ప్రాంతంలోని పలు లంక గ్రామాలు నీటిలోనే ఉన్నాయి. వరద ముంపు ఇంకా తొలగిపోలేదని అధికారులు చెబుతున్నారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ  శాఖాధికారులు హెచ్చరించిన నేపథ్యంలో  గోదావరి పరివాహక ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు.

also read:ధవళేశ్వరం వద్ద 21.7 అడుగులకు చేరిన గోదావరి:పునరావాస కేంద్రాలకు 71,200 మంది

అయితే Bhadrachalam వద్ద  గోదావరి వద్ద గోదావరి వరద ఉధృతి కొంత తగ్గింది. నిన్న రాత్రి నుండి గోదావరి ఆరు అడుగులు తగ్గింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి 65 అడుగులకు చేరింది. 

click me!