గోదావరికి వరద పోటెత్తింది., ధవళేశ్వరం వద్ద గోదావరి నది 21.7 అడుగులకు చేరింది. మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
రాజమండ్రి: Godavari నదికి వరద పోటెత్తింది. Dowleswaram వద్ద గోదావరి నది 21.7 అడుగులకు చేరింది. మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతన్నారు.
ధవళేశ్వరంనుండి 25.80 లక్షల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువ నుండి వరద ప్రభావం తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఇప్పటికే భద్రాచలం వద్ద గోదావరి వరద తగ్గుతుంది. నిన్నటి నుండి ఇవాళ ఉదయం వరకు గోదావరి సుమారు ఆరు అడుగుల మేర తగ్గింది. దీంతో దిగువకు వరద నీరు కూడా తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనాతో ఉన్నారు. వరద ప్రభావం తగ్గే వరకు గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
undefined
ఇదిలా ఉంటే Andhra Pradesh రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటు గోదావరి ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు.
గోదావరికి వరద పోటెత్తడంతో రాజమండ్రిలో లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. గోదావరికి వరద పోటెత్తడంతో నల్ల చానెల్ గేట్లను మూసివేశారు. గోదావరికి వెళ్లే మార్గం లేక మురికి నీరు వెనక్కి వస్తుంది. దీంతో రాజమండ్రి పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాల్లో మురికి నీరు చేరుతుంది. తుమ్మలోవ, సీతంపేట, లింగంపేట, ములుగొయ్యి ప్రాంతాలు నీటిలో మునిగాయి.
గోదావరి పరివాహక ప్రాంతంలోని లంక గ్రామాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆరు జిల్లాలోని 62 మండలాల్లోని 324 గ్రామాలకు వరద నీరు చేరింది. తాజాగా మరో 191 గ్రామాల్లోకి వరద వచ్చి చేరిందని అధికారులు తెలిపారు. ఇప్పటికే 76,775 మందిని ఆయా గ్రామాల నుండి తరలించారు. వరద ముంపులో ఉన్న సుమారు 71,200 మందిని 177 పునరావాస కేంద్రాలకు తరలించినట్టుగా అధికారులు వివరించారు.
also read:గోదావరికి వరద: ఏటూరునాగారంలో వరద ప్రాంతాల్లో పర్యటించనున్న కేసీఆర్
గోదావరి నదికి వరద పోటెత్తడంతో అధికారుఅు అప్రమత్తమయ్యారు. రెండు రోజుల క్రితం సీఎం YS Jagan వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం పరిశీలించారు.