ధవళేశ్వరం వద్ద గోదావరి పోటెత్తింది. శుక్రవారం మధ్యాహ్నానికి గోదావరి 18 అడుగులకు చేరింది. ఇవాళ రాత్రికి గోదావరి నది 23 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
రాజమండ్రి: Godavari కి వరద పోటెత్తింది. దీంతో Dowleswaram వద్ద గోదావరి నది శుక్రవారం నాడు 18 అడుగులకు చేరింది. ధవళేశ్వరం నుండి 23 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పటికే Telangana లోని భధ్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపంలో ప్రవహిస్తుంది. శుక్రవారం నాడు మధ్యాహ్నానికి గోదావరి సుమారు 69.40 అడుగులకు చేరింది. Bhadrachalam వద్ద గోదావరి సుమారు 23,40,276 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తుంది. భద్రాచలం దిగువన ఉన్న గోదావరి దాని ఉప నదుల్లో వరద నీరు చేరి ధవళేశ్వరానికి భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలోని భద్రాచలం వద్ద ఇవాళ సాయంత్రానికి గోదావరి 73 అడుగులు దాటొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
undefined
ధవళేశ్వరం వద్ద కూడా గోదావరికి భారీగా వరద నీరు చేరే అవకాశం ఉందని అధికకారులు అభిప్రాయంతో ఉన్నారు. 2020 లో ధవళేశ్వరం నుండి 23 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. అయితే ఈ దఫా అంతకంటే ఎక్కువ నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Polavaram ప్రాజెక్టు వద్ద కూడా గోదావరి పోటెత్తింది. పోలవరం ప్రాజెక్టు నుండి 48 గేట్లను ఎత్తి 18.41 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.పోలవరం స్పిల్ వే ఎగువన స్పిల్ వే ఎగువన 35.680 , దిగువన 27,490 మీటర్ల నీటి మట్టం ఉందని అధికారులు ప్రకటించారు. ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. తెలంగానలో భద్రాచలం వద్ద కూడా మూడో ప్రమాద హెచ్చరికను దాటి వరద పోటెత్తింది.
ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం గోదావరి నది 18 అడుగులకు చేరింది. దిగువకు 19.70 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం నుండి 23 లక్షలకు పైగా వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 22 లక్షల క్యూసెక్కులు ధవళేశ్వరం వద్ద గోదావరి చేరితే ఆరు జిల్లాలోని 554 గ్రామాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. 22 లక్షల వరద దాటితే మరిన్ని గ్రామాలకు వరద ముంపు ఉండే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయంతో ఉన్నారు. వరదను పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని రెస్క్యూ టీమ్ లను సిద్దం చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు అధికారులు. వరద ప్రభావిత గ్రామాల్లో ఎనిమిది ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయి.
also read:భద్రాచలం వద్ద 68 అడుగులకు చేరిన గోదావరి:48 గంటలు అప్రమత్తం
ఇప్పటికే లంక గ్రామాల ప్రజలను పునరావాస ప్రాంతాలకు తరలించారు. మరో వైపు కొన్ని లంక గ్రామాల ప్రజలు వరద పోటెత్తినా కూడా తాము వరదలో ఉన్న ఇళ్లలోనే ఉంటామని చెబుతున్నారు. వరద మరింత పెరిగే అవకాశం ఉన్నందున పునరావాస శిబిరాలకు వెళ్లాలని అధికారులు వరద ముంపు గ్రామాల ప్రజలను కోరుతున్నారు.