కచ్చలూరు పడవ ప్రమాదం: సుప్రీమ్ లో హర్ష కుమార్ పిటిషన్

By telugu teamFirst Published Oct 5, 2019, 4:54 PM IST
Highlights

బోటును మిగిలిన మృతదేహాలను త్వరగా వెలికితీసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలని సుప్రీమ్ కోర్టును కోరారు. బోటును  వెలికితీయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు హర్ష కుమార్. 

గోదావరి నదిలో జరిగిన బొట్టు ప్రమాదంపై మాజీ ఎంపీ హర్ష కుమార్ సుప్రీమ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. బోటును మిగిలిన మృతదేహాలను త్వరగా వెలికితీసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలని సుప్రీమ్ కోర్టును కోరారు. బోటును  వెలికితీయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు హర్ష కుమార్. 

ఇదే విషయమై గతంలో హర్ష కుమార్ కొన్ని సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దేవీపట్నం-కచ్చలూరు మధ్య  ఈ నెల 15వ తేదీన బోటు ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 93 మంది ఉన్నారని ఆయన చెప్పారు. దేవీపట్నం ఎస్ఐ వద్దని వారించినా కూడ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఫోన్ చేయడం వల్లే బోటు ముందుకు కదిలిందని హర్షకుమార్ ఆరోపించారు. 

ఈ ప్రాంతంలో బోట్లలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ప్రమాదం జరిగిన బోటులో కూడ ఇలానే జరిగి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

గోదావరిలో తిరిగే బోట్లలో నాయకులు, పర్యాటక శాఖ అధికారుల పెట్టుబడులు ఉన్నాయన్నారు. ఈ ప్రమాదం విషయంలో  అధికారులు సీఎం జగన్ కు తప్పుదోవ పట్టిస్తున్నారని కూడా గతంలో హర్ష కుమార్ ఆరోపించారు. . 

click me!