Godavari Boat Incident: గుర్తుపట్టని విధంగా బోటులో మృతదేహాలు, ఇలా గుర్తించారు

Published : Oct 23, 2019, 03:13 PM ISTUpdated : Nov 04, 2019, 01:37 PM IST
Godavari Boat Incident: గుర్తుపట్టని విధంగా బోటులో మృతదేహాలు, ఇలా గుర్తించారు

సారాంశం

తూర్పు గోదావరి జిల్లా  దేవీపట్నం-కచ్చులూరు మధ్య గోదావరిలో  మునిగిన రాయల్ వశిష్ట బోటులో దొరికిన మృతదేహాలను కుటుంబసభ్యులు బుధవారం నాడు గుర్తించారు. వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన రవీందర్ మృతదేహాన్ని  ఐడెంటిటీ కార్డు ద్వారా గుర్తించారు. డ్రైవర్ నూకరాజు మృతదేహాన్ని టీ షర్ట్ ఆధారంగా గుర్తించారు. 


దేవీపట్నం: రాయల్ వశిష్ట బోటును వెలికితీయడంతో బోటులో ఉన్న మృతదేహాలను కుటుంబసభ్యులు గుర్తించారు. వరంగల్ అర్బన్ జిల్లా కడిపికొండకు చెందిన కొమ్మల రవీంద్ర జేబులో లభ్యమైన గుర్తింపు ఆధారంగా ఆయన మృతదేహాన్ని గుర్తించారు.

రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వద్ద మృతుల కుటుంబసభ్యులు తమ వారిని గుర్తించి కన్నీరుమున్నీరుగా విలపించారు. రాయల్ వశిష్ట బోటును డ్రైవర్ నూకరాజు నడిపాడు. ఈ బోటు డ్రైవర్ గా నూకరాజు మూడేళ్లుగా పనిచేస్తున్నాడు.

ప్రమాదం జరిగిన రోజు రాయల్ వశిష్ట బోటును నడిపిన డ్రైవర్ నూకరాజు టీ షర్ట్ వేసుకొన్నాడు.ఈ టీ షర్ట్ ఆధారంగానే నూకరాజు డెడ్ బాడీగా కుటుంబసభ్యులు గుర్తించారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన రమ్యశ్రీ మృతదేహాన్ని ఇంకా గుర్తించలేదు. ఈ మృతదేహాన్ని ఇంకా గుర్తించాల్సి ఉంది.

ఈ ప్రమాదంలో గల్లంతైన వారిలో  గీతా వైష్ణవి, ధాత్రి, అఖిలేష్ (విశాఖ) ,రమ్యశ్రీ(మంచిర్యాలు  రాజ్ కుమార్, రాజశేఖర్ (వరంగల్) ల మృతదేహాలను ఇంకా గుర్తించాల్సి ఉంది.మణికంఠ, ధర్మరాజు (వరంగల్) రవీందర్(నల్గొండ) రవి (వరంగల్ అర్బన్ ఐదేళ్ల బాలుడు విఖ్యాత్ రెడ్డి నంద్యాల) ల మృతదేహాలను కుటుంబసభ్యులు గుర్తించారు. 


సెప్టెంబర్ 15న కచ్చులూరు వద్ద పర్యాటకులతో వెళ్తున్న రాయల్ వశిష్ట బోటు గోదావరిలో మునిగిపోయింది. ప్రమాద సమయంలో బోటులో మొత్తం 77 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. దీంతో ఇంకా దాదాపు 14 మంది ఆచూకీ దొరకలేదు.

ఏసీ క్యాబిన్‌లో పలువురు ప్రయాణికులు చిక్కుకుని ఉంటారని భావించారు. మునిగిపోయిన బోటు వెలికితీత కోసం అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ధర్మాడి సత్యం బృందానికి ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చింది. 

బోటును వెలికితీసే పనిని మంగళవారం నాడు ఉదయం ధర్మాడి సత్యం బృందం ప్రారంభించింది. సోమవారం నాడు రాయల్ వశిష్ట బోటు వెలికితీసే ప్రక్రియలో బోటు పై భాగం ముక్కలు బయటకు వచ్చాయి.

గోదావరి నదిలో ఇసుక పేరుకుపోవడంతో కూడ బోటు వెలికితీతకు కొంత ఇబ్బందులు చోటు చేసుకొన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.సోమవారం ఉదయం ధర్మాడి సత్యం బృందం బోటు పైకప్పును ఎట్టకేలకు బయటకు తీసింది. రెండు రోప్‌ల మునిగిపోయిన బోటుకు కట్టి వెలుపలికి తీసేందుకు ప్రయత్నించారు. అయితే ఆ సమయంలో బోటు పైకప్పు భాగాలు బయటకు వచ్చాయి.

రాయల్‌ వశిష్ఠ పర్యాటక బోటు వెలికితీత పనులను కాకినాడ పోర్టు అధికారి కెప్టెన్‌ ఆదినారాయణ పర్యవేక్షిస్తున్నారు. విశాఖపట్నం నుంచి వచ్చిన ఓం శివశక్తి అండర్‌ వాటర్‌ సర్వీసెస్‌కు చెందిన పది మంది డైవర్లలో నాగరాజు, స్వామి అనే ఇద్దరు ఆదివారం ఉదయం 11 గంటలకు బోటు మునిగిన ప్రదేశంలో నీటి అడుగు భాగంలోకి వెళ్లారు.

దాదాపు 15 నిమిషాలపాటు ఆ ప్రాంతంలో బోటు ఎలా ఉంది? దాని చుట్టూ ఇసుక, మట్టి ఎంతమేర పేరుకుపోయాయి? బోటుకు ఎక్కడ తాడు బిగిస్తే పైకి రావడానికి అనువుగా ఉంటుందనే కోణంలో పరిశీలించి వచ్చి పోర్టు అధికారికి వివరించారు.  

ఇలా 6 సార్లు డైవర్లు బోటు మునిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. గోదావరిలో బోటు ఏటవాలుగా మునిగి ఉందని పోర్టు అధికారి కెప్టెన్‌ ఆదినారాయణ విలేకర్లకు తెలిపారు. నదిలో బోటు ముందు భాగం 40 అడుగుల లోతులో ఉంటే, వెనుక భాగం దాదాపు 70 అడుగుల లోతులో ఉందని చెప్పారు. 

మంగళవారం నాడు ఉదయం నుండే బోటును వెలికితీసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. బోటుకు ఇనుప రోప్ వేసి ప్రొక్లెయినర్ సహాయంతో బయటకు లాగనున్నారు. సోమవారం నాడు బోటు కొన్ని అడుగుల దూరం జరిగింది. ప్రొక్లెయినర్ తో లాగే క్రమంలో బోటు పైకప్పు విడిభాగాలు మాత్రమే బయటకు వచ్చాయి.

Operation Royal vasista: ధర్మాడి సత్యం బీ ప్లాన్ సక్సెస్, బోటు ఎలా తీశారంటే........
 

Royal Vashista Operation: బోటు వెలికితీతపై ధర్మాడి సత్యం స్పందన ఇదీ.........

బోటును వెలికి తీసిన ధర్మాడి సత్యం టీమ్......

Operation Royal vashista: ఎవరీ ధర్మాడి సత్యం?...

PREV
click me!

Recommended Stories

Palla Srinivas on Lokesh Birthday: లోకేష్అంటే నమ్మకం.. నిత్యంప్రజల్లోనే ఉంటారు | Asianet News Telugu
Legendary Actor Krishnam Raju 86th Birth Anniversary | Free Mega Diabetes Camp | Asianet News Telugu