ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు, యనమల పైకి గొప్పలు చెప్పి ముంచేశారు: ఆర్థికమంత్రి బుగ్గన

By Nagaraju penumalaFirst Published Oct 23, 2019, 2:32 PM IST
Highlights

పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన వాళ్లు సూట్లు లేకుండా వచ్చినా చంద్రబాబు ప్రభుత్వం సూట్లు కుట్టించి తొడిగి హడావుడి చేశారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పాలనలో రాష్ట్రానికి ఏదో జరిగిపోతుందని చంద్రబాబు ఉద్ధరించేస్తారని భ్రమలు కల్పించి పాలన చేశారని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. 

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆనాటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతో కలిసి అప్పుల ఊబిలోకి నెట్టేశారని ఆరోపించారు. 

గత ప్రభుత్వం అతిదరిద్రమైన ఆర్థికస్థితిని వారసత్వంగా ఇచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులన్నీ తమపై పెట్టి ఇప్పుడు నిందులు వేస్తోందంటూ ఆగ్రఱహం వ్యక్తం చేశారు. 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 16వ ర్యాంక్‌లో ఉందని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పుకొచ్చారు. ర్యాంక్ పడిపోవడానికి ఆనాటి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడే కారణమని ఆరోపించారు. చంద్రబాబు, యనమల చెప్తున్నవన్నీ అబద్దాలేనని విమర్శించారు  

ఇకపోతే గత ప్రభుత్వ పాలసీ వల్లే రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిందని చెప్పుకొచ్చారు. త్వరలోనే ఇసుక కష్టాలు తీరతాయని బుగ్గన స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యుత్‌ కోతలపై జరుగుతున్న ప్రచారంపై బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పర్యావరణానికి హాని జరుగుతుందనే థర్మల్‌ విద్యుత్‌ను తగ్గించామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా  అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అర్థంపర్థం లేని విమర్శలు చేస్తోందన్నారు. 

15 రోజుల్లో 36 పీపీఏలు చేసుకున్న చంద్రబాబు అంత ఆత్రంగా వైసీపీ ప్రభుత్వ పని తీరుకు క్రిసిల్‌ డి రేటింగ్‌ ఇచ్చిందనడం సరికాదన్నారు. 2010లో కూడా క్రిసిల్‌ డి రేటింగ్‌ ఇచ్చిందని, విద్యుత్‌ లాంటి సంస్థలు గాడిన పడాలంటే కొన్నేళ్లు పడుతుందని బుగ్గన చెప్పుకొచ్చారు. 

విద్యుత్‌పై చంద్రబాబు చెబుతున్నవన్నీ తప్పుడు ప్రచారమేనని చెప్పుకొచ్చారు. 2019లో 9,500 మెగావాట్ల పీక్ డిమాండ్‌ను అందుకోవడానికి ఏపీ చాలా అధిగమించాల్సి వచ్చిందన్నారు. రాష్ట్రంలో 9 వేల మెగా వాట్ల డిమాండ్‌ ఉంటే 8 వేలమెగా వాట్ల సంప్రదాయ విద్యుత్‌పై ఆధారపడాలని చూశారని, అంది ఎంత అన్యాయమైన పాలసీనో ప్రజలే అర్థం చేసుకోవాలన్నారు. 

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ కి పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు వచ్చేశాయని గొప్పలు చెప్పుకుందని అదంతా ఒట్టి ప్రచారమేనని చెప్పుకొచ్చారు. అదంతా అబద్ధపు ప్రచారంగా కొట్టిపారేశారు. 

పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన వాళ్లు సూట్లు లేకుండా వచ్చినా చంద్రబాబు ప్రభుత్వం సూట్లు కుట్టించి తొడిగి హడావుడి చేశారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పాలనలో రాష్ట్రానికి ఏదో జరిగిపోతుందని చంద్రబాబు ఉద్ధరించేస్తారని భ్రమలు కల్పించి పాలన చేశారని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. 

click me!