పెళ్లి కొడుకు ఇంటికి నిప్పు పెట్టిన పెళ్లి కూతురు బంధువులు.. !

Published : Feb 01, 2021, 12:43 PM IST
పెళ్లి కొడుకు ఇంటికి నిప్పు పెట్టిన పెళ్లి కూతురు బంధువులు.. !

సారాంశం

అనంతపురం జిల్లా నాగసముద్రంలో దారణం జరిగింది. పెద్దలను కాదని ప్రేమపెళ్లి చేసుకున్నారన్న కోపంతో పెళ్లికొడుకు ఇంటికి పెళ్లి కూతురు బంధువులు నిప్పంటించారు. ఆదివారం జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి...

అనంతపురం జిల్లా నాగసముద్రంలో దారణం జరిగింది. పెద్దలను కాదని ప్రేమపెళ్లి చేసుకున్నారన్న కోపంతో పెళ్లికొడుకు ఇంటికి పెళ్లి కూతురు బంధువులు నిప్పంటించారు. ఆదివారం జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి...

నాగసముద్రం మండలంలోని వెంకటాంపల్లికి చెందిన బోయ మల్లికార్జున కూతురు సుమిత్ర గ్రామ వలంటీర్ గా పనిచేస్తోంది. నాగసముద్రం గ్రామానికి చెందిన నాగప్ప కొడుకు హేమంత్ ఇంటర్ వరకు చదువుకుని వ్యవసాయం చేస్తున్నాడు. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. 

రెండ్రోజుల క్రితం వీరిద్దరూ ఇంటినుంచి పారిపోయారు. పెళ్లి చేసుకుని ఆదివారం 
ఆదివారం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో హాజరయ్యారు. అయితే వీరిద్దరూ మేజర్లు కావడంతో పోలీసులు తల్లిదండ్రులను పిలిపించి సర్దిచెప్పి పంపించారు.

అయితే పరిస్థితుల రీత్యా ఈ జంటను తమ ఇంట్లో ఉంచుకుంటే సమస్యలు వస్తయనుకున్న అబ్బాయి తల్లిదండ్రులు వారిద్దరినీ బంధువు ఇంటికి పంపించారు. ఆదివారం సాయంత్రం పెళ్లి కూతురు సుమిత్ర తరఫు బంధువులు కొందరు నాగసముద్రంలోని హేమంత్ ఇంటిమీద కిరోసిన్ పోసి నిప్పంటించారు.

గమనించిన చుట్టుపక్కల వారు మంటలు ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అంతేకాదు వారు ఈ ఘటనకు తెగబడ్డ వాళ్లను మందలించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే గ్రామానికి చేరుకున్న పోలీసులు నిప్పంటించిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
YSRCP Mayor Candidate : నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి.. ఎవరీ విజయ్ కుమార్ రెడ్డి?