
సబ్బవరం : ప్రియుడు మోసం చేశాడని అతని ఇంటి ముందు ధర్నా చేసిన గోపాలపట్నం దరి ఎల్లపువానిపాలేనికి కాండ్రేగుల శ్రీవాణిజ్యోతి(30) cheddi gangలో ఒకరుగా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సబ్బవరం మండలం టెక్కలిపాలెం గ్రామానికి చెందిన పందాల సత్యనారాయణ తనను marriage చేసుకుని పరారయ్యాడని ఈ నెల 27న శ్రీవాణిజ్యోతి అతని ఇంటి ముందు dharna చేసింది. తన వద్ద ఉన్న ఆధారాలను చూపిస్తూ గోపాలపట్నం, సబ్బవరం పోలీస్ స్టేషన్లలో న్యాయం జరగలేదు అంటూ వాపోయింది.
ఇలా ఉండగా తన కుమారుడు పందాల సత్యనారాయణను శ్రీవాణిజ్యోతి బెదిరిస్తూ తీవ్ర ఇబ్బందులు పెడుతోందని తల్లి పందాల వరలక్ష్మి శుక్రవారం సబ్బవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె వేధింపులకు తాళలేక తన కుమారుడు ఇంటికి కూడా రావడం లేదని, ఏమయ్యాడో తెలియదని వాపోయారు. డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తానని బెదిరించడంతో తన కుమారుడు భయపడి ఎక్కడికో వెళ్ళిపోయాడు అని పేర్కొంది. ఆమె నుంచి తనకు తన కుమారుడికి ప్రాణహాని ఉందని సీఐ చంద్రశేఖర్రావుకు వినతి పత్రం అందజేశారు.
ఈ విషయమై సిఐ మాట్లాడుతూ…
తనను సత్యనారాయణ మోసం చేశాడని శ్రీవాణిజ్యోతి గతంలో సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది అన్నారు. ఆ మేరకు దర్యాప్తు చేయగా శ్రీవాణిజ్యోతి చెడ్డీగ్యాంగ్ లో సభ్యురాలని తేలిందన్నారు. గోపాలపట్నం, కంచరపాలెం తదితర పోలీస్స్టేషన్లలో ఆమెపై 40కి పైగా కేసులు నమోదై ఉన్నాయన్నారు. రెండు కేసులు ఆరేసి నెలల చొప్పున జైలు శిక్ష కూడా అనుభవించారు ఉందన్నారు. సత్యనారాయణ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు.
ఇదిలా ఉండగా, చెన్నైలో ఓ దారుణ ఘటన జరిగింది. భార్యతో divorce కోసం కోర్టుకు వచ్చిన ఓ భర్త అందరూ చూస్తుండగానే ఆమెపై knifeతో విచక్షణారహితంగా దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. tamilnaduలోని పెరంబదూర్ జిల్లా కోర్టు వద్ద చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుధా, కామరాజు అనే దంపతులు విడిపోయి గత కొన్నేళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. విడాకుల కోసం courtను ఆశ్రయించగా.. ఆ కేసు విచారణ కొనసాగుతోంది. అయితే, శుక్రవారం ఈ కేసు విచారణ కోసం వారిద్దరూ అనుకోకుండా ఒకే బస్సులో ప్రయాణం చేసి వచ్చారు.
కోర్టు బస్ స్టాప్ వద్ద దిగగానే... దాచి పెట్టుకొని వచ్చిన కత్తితో కామ్ రాజ్.. తన భార్యపై దాడి చేశాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని హత్యాయత్నం నేరం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ మణి వెల్లడించారు. అదే బస్సు నుంచి దిగిన ఓ పోలీసు, కోర్టు బయట విధులు నిర్వర్తించే వ్యక్తి అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఒకరికి తీవ్ర గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు. మహిళకు చికిత్స కొనసాగుతుందన్నారు. ఈ జంట గత కొన్నేళ్లుగా విడాకుల కోసం పోరాడుతుండగా.. ప్రస్తుతం ఈ కేసు ఆఖరి దశలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.