
ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలో దారుణం చోటుచేసుకుంది.మహిళతో సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తి.. ఆమె కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను బెదిరించి పదినెలల పాటుగా ఈ ఘాతుకానికి పాల్పడుతూ వచ్చాడు. బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. కోమటి సురేష్ అనే వ్యక్తి బాధిత బాలిక తల్లితో సహజీవనం చేస్తున్నాడు. తండ్రి స్థానంలో ఉన్న అతడు బాలికతో మృగంలా ప్రవర్తించాడు. బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే బాలిక గర్భం దాల్చింది.
గర్భంతో ఉన్న బాలికను బంధువులు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే నిన్న బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు కోమటి సురేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు డ్రైవర్‌గా పనిచేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కాగా, ఇందుక సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.