15 రోజుల్లో వేరే యువకుడితో పెళ్లి: ప్రియుడి పనితో యువతి ఆత్మహత్య

Published : Aug 09, 2021, 11:19 AM IST
15 రోజుల్లో వేరే యువకుడితో పెళ్లి: ప్రియుడి పనితో యువతి ఆత్మహత్య

సారాంశం

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. వేరే యువకుడితో 15 రోజుల్లో వివాహం కావాల్సిన యువతి ఆత్మహత్య చేసుకుంది. ప్రియుడి బ్లాక్ మెయిల్ వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుంది.

శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. పక్షం రోజుల్లో వివాహం కావాల్సిన యువతి ఆత్మహత్య చేసుకుంది. ప్రియుడి పనితో పరువు పోయిందని మనస్తాపానికి గురైంది. దాంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. 

వేరే యువకుడిని ఈ నెల 26వ తేదీన కొత్తపల్లి లీలావతి అనే యువతికి వివాహం జరగాల్సి ఉండింది. ఈ విషయం తెలిసిన ఆమె ప్రియుడు ఆమె తనతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను, తనతో చేసిన ఛాటింగ్ విషయాలను ఆమె కుటుంబ సభ్యులకు, బంధువులకు పంపించాడు. 

లీలావతి ఫోటోలను, చాటింగ్ లను షేర్ చేసిన వెంకటేష్ అనే యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. లీలావతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంకటేష్ మీద పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసు నమోదు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే