దేశంలో ఒమిక్రాన్ ప్రభావం పెరిగే అవకాశం ఉందని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు 23 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఒమైక్రాన్ వైరస్ ను గుర్తించేందుకు జీనోమ్ స్వీక్వెన్సింగ్ ల్యాబ్ (Genome Sequencing Lab) ను విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సీసీఎంబీతో ఏపీ సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది.
Genome Sequencing Lab: ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్ కేవలం రెండు వారాల వ్యవధిలోనే 57 దేశాలకు విస్తరించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలో భారత్ లో కూడా ఈ వేరియంట్ ప్రవేశించింది. ఇప్పటివరకూ రెండు పదుల సంఖ్యలో కేసుల నమోదయ్యాయి. మరోవైపు దేశంలో మరోసారి కరోనా డేంజర్ బెల్స్ మోగబోతున్నట్టు ఆరోగ్య నిపుణులు.. శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పడుతున్న.. ఫిబ్రవరి, మార్చి కల్లా.. పీక్స్ కు చేరుకుంటాయని హెచ్చరించారు.
దీంతో సర్వత్రా టెన్షన్ మొదలైంది.
ఇదిలా ఉంటే.. ఏపీలో కూడా ఒమిక్రాన్ భయం పట్టుకుంది. శ్రీకాకుళం జిల్లాలో ఒమిక్రాన్ కేసు నమోదు అయిందన్న వార్తల నేపథ్యంలో రాష్ట్రం పానిక్ మోడ్ లోకి వెళ్లిపోయింది. దీంతో ఏపీ సర్కార్ అప్రమత్తమయింది. గత అనుభవాల దృష్ట్యాలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కరోనా మహమ్మారి విస్తరించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. రాష్ట్రవ్యాప్తంగా మాస్క్ తప్పని సరి చేసింది. మాస్క్ ధరించవారికి రూ. 1000 జరిమానా విధించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
undefined
ఒమైక్రాన్ వైరస్ ను గుర్తించేందుకు జీనోమ్ స్వీక్వెన్సింగ్ చెయ్యాల్సి ఉంటుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో మాత్రమే ఈ జీనోమ్ స్వీక్వెన్సింగ్ ల్యాబ్స్ అందుబాటులో ఉన్నాయి. దీంతో ఏపీ సాంపిల్స్ ను హైదరాబాద్ కు లేదా.. సరిహద్దు రాష్ట్రాలకు పంపించాల్సి వస్తుంది. అయితే పరీక్షల ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యం జరుగుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఏపీ సర్కార్ జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ల ఏర్పాటుపై దృష్టి సారించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఆరోగ్య వసతుల కల్పన అన్ని రాష్ట్రాలకు అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.
పరీక్షలను ఫలితాలు మరింత వేగంగా పొందడానికి జీనోమ్ స్వీక్వెన్సింగ్ ల్యాబ్ ను ఏపీలోనే ప్రారంభించాలని నిర్ణయించారు. విజయవాడ కేంద్రం ఈ ల్యాబ్ ను ఏర్పాటు చేసేందుకు సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ (సీసీఎంబీ)తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ క్రమంలో విజయవాడలో వచ్చే వారంలో ల్యాబ్ ల కార్యకలాపాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. ఈ ల్యాబ్ లో పనిచేసే వైద్య సిబ్బందికి హైదరాబాద్ లో శిక్షణ ఇప్పించామని ఆయన వెల్లడించారు. ఏది ఏమైనా కరోనా మహమ్మారి రోజుకో రూపంలో పంజా విసురుతున్న కారణంగా వైద్య సదుపాయాలపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. అందుకే జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ల ఏర్పాటుకు రంగంలోకి దిగింది.