15 కత్తిపోట్లతో ప్రేయసిని చంపిన ఢిల్లీ బాబు: అడవిలోకి పరారీ, ఆత్మహత్య?

Published : Jan 20, 2021, 11:31 AM ISTUpdated : Jan 20, 2021, 11:38 AM IST
15 కత్తిపోట్లతో ప్రేయసిని చంపిన ఢిల్లీ బాబు: అడవిలోకి పరారీ, ఆత్మహత్య?

సారాంశం

ప్రేయసిని అత్యంత కిరాతకంగా చంపి అడవిలోకి పారిపోయిన ఢిల్లీ బాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. అతని తల్లిదండ్రులను పోలీసులు విచారిస్తున్నారు.

చిత్తూరు: ప్రేయసిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఢిల్లీ బాబు అడవిలోకి పారిపోయాడు. చిత్తూరు జిల్లా పెనుమూరు వద్ద గాయత్రిని 15 సార్లు ఢిల్లీ కత్తితో పొడిచి పారిపోయిన విషయం తెలిసిందే. అడవిలోకి పారిపోయిన ఢిల్లీ బాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతను ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఢిల్లీ బాబు తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం తూర్పుపల్లి గ్రామానికి చెందిన గాయత్రి (19) అనే యువతిని పూతలపట్టు మండలం చింతమాకుల పల్లి గ్రామానికి చెందిన ఢిల్లీ బాబు (19) ప్రేమించాడు. వీరిద్దరు రెండు నెలల క్రితం ఇంట్లో నుంచి పారిపోయి వివాహం చేసుకున్నారు. 

పెళ్లి చేసుకున్న సమయంలో ఇద్దరు కూడా మైనర్లు. దీంతో పోలీసులు వారిద్దరి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ చేసి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. 

ఇదిలావుంటే, మంగళవారం మధ్యాహ్నం పెనుమూరు వద్ద సంత నుంచి తిరిగి వెళ్తున్న గాయత్రిని ఢిల్లీ దారి కాచి ఆపాడు. ఆమె మీద కత్తితో దాడి చేసి పారిపోయాడు. యువతిని పోలీసులు వేలూరులోని సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

PREV
click me!

Recommended Stories

Weather Update: ఏపీ, తెలంగాణలో మారిన వాతావరణం.. 15 జిల్లాలకు హై అలర్ట్.. అక్కడ తుపాను గండం
అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu