15 కత్తిపోట్లతో ప్రేయసిని చంపిన ఢిల్లీ బాబు: ఉరేసుకుని ఆత్మహత్య

Published : Jan 20, 2021, 02:03 PM IST
15 కత్తిపోట్లతో ప్రేయసిని చంపిన ఢిల్లీ బాబు: ఉరేసుకుని ఆత్మహత్య

సారాంశం

ప్రేయసిని దారుణంగా కత్తితో పొడిచి చంపేసిన ఆమె ప్రియుడు ఢిల్లీ బాబు ఆత్మహత్య చేసుకున్నాడు. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం తూర్పు పల్లి అటవీ ప్రాంతంలో ఉరేసుకుని మరణించాడు.

చిత్తూరు: ఊహించిందే జరిగింది. ప్రేయసిని కత్తితో పొడిచి హత్య చేసున యవకుడు ఢిల్లీ బాబు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం అటవీ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రేయసి గాయత్రిని అతను మంగళవారంనాడు హత్య చేసి అడవుల్లోకి పారిపోయిన విషయం తెలిసిందే.

చిత్తూరు జిల్లా పెనుమూరు వద్ద గాయత్రిని 15 సార్లు ఢిల్లీ కత్తితో పొడిచి పారిపోయాడు. అడవిలోకి పారిపోయిన ఢిల్లీ బాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతను ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని అనుమానించారు.. ఢిల్లీ బాబు తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు.

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం తూర్పుపల్లి గ్రామానికి చెందిన గాయత్రి (19) అనే యువతిని పూతలపట్టు మండలం చింతమాకుల పల్లి గ్రామానికి చెందిన ఢిల్లీ బాబు (19) ప్రేమించాడు. వీరిద్దరు రెండు నెలల క్రితం ఇంట్లో నుంచి పారిపోయి వివాహం చేసుకున్నారు. 

పెళ్లి చేసుకున్న సమయంలో ఇద్దరు కూడా మైనర్లు. దీంతో పోలీసులు వారిద్దరి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ చేసి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. 

ఇదిలావుంటే, మంగళవారం మధ్యాహ్నం పెనుమూరు వద్ద సంత నుంచి తిరిగి వెళ్తున్న గాయత్రిని ఢిల్లీ దారి కాచి ఆపాడు. ఆమె మీద కత్తితో దాడి చేసి పారిపోయాడు. యువతిని పోలీసులు వేలూరులోని సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!
Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu