చీపురుపల్లిపై గంటా వ్యాఖ్యలతో చిచ్చు.. కిమిడి మనస్తాపం

By Mahesh K  |  First Published Feb 22, 2024, 10:06 PM IST

గంటా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు చీపురుపల్లి టీడీపీలో గందరగోళానికి తెరతీశాయి. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణపై పోటీకి దిగాలని పార్టీ నాయకులు తనను కోరినట్టు గంటా వ్యాఖ్యలు చేశారు. ఈ టికెట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న కిమిడి నాగార్జున ఈ వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. 
 


TDP: మంత్రి బొత్స సత్యనారాయణపై మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌ను నిలబెట్టాలని టీడీపీ భావించింది. బొత్సను ఎలాగైనా ఓడించాలని చీపురుపల్లిలో గంటాను బరిలోకి దింపాలని అనుకుంది. ఇదే విషయాన్ని గంటా శ్రీనిసవాసరావుకు తెలిపారు. తాను గతంలో విశాఖపట్టణం లోని వేర్వేరు స్థానాల నుంచి పోటీ చేసి గెలిచానని చెప్పారు. అలాంటిది చీపురుపల్లి ఇక్కడి నుంచి 150 కిలోమీటర్లు అని, అది వేరే జిల్లా అని అన్నారు. తనను విశాఖపట్టణం నుంచి పంపించేయాలని అనుకుంటున్నారా? అనే అనుమానాన్ని వ్యక్తపరిచారు. అలాగే.. చీపురుపల్లిలో తాను పోటీ చేస్తాననీ పేర్కొనలేదు. కానీ, ఈ విషయంపై తన టీమ్, అనుచరులు, సన్నిహితులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని వివరించారు.

ఈ వ్యాఖ్యలు చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని భావిస్తున్న టీడీపీ టికెట్ ఆశావహుడు కిమిడి నాగార్జునను ఇబ్బంది పెట్టాయి. చీపురుపల్లికి ఇంచార్జీగా ఉన్న కిమిడి నాగార్జున టీడీపీ టికెట్ తనకే వస్తుందని అనుకున్నారు. టీడీపీ టికెట్ కోసం ఆశగా ఎదుుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో టీడీపీ నిర్ణయం, గంటా శ్రీనివాస్ నిర్ణయాల గురించి మాట్లాడటం.. ఆయనను కలిసివేసినట్టు తెలుస్తున్నది. ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్టు సమాచారం. అందుకే వెంటనే పార్టీ కార్యక్రమాలకు దూరంగా జరిగారు. పార్టీ పెద్దల ఫోన్లకూ నాగార్జున అందుబాటులోకి రావడం లేదు.

Latest Videos

Also Read: Top Ten News @ 6.30 PM: ఏషియానెట్‌లో టాప్ 10 వార్తలు

అందుకే నాగార్జున ఇంటికి వెళ్లాలని టీడీపీ నాయకులు నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం. దీంతో గంటా వ్యాఖ్యలతో చీపురుపల్లి టీడీపీలో గందరగోళం నెలకొంది. పార్టీ కార్యక్రమాలకు జిల్లా ప్రధాన కార్యదర్శిని సంప్రదించాలని ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు అయిన కిమిడి నాగార్జున ఆఫీసుకు సమాచారం ఇచ్చినట్టు సమాచారం.

click me!