పైకి కూరగాయల వ్యాపారిగా బిల్డప్.. కట్ చేస్తే ఎర్రచందనం స్మగ్లర్, అంతర్జాతీయ స్థాయిలో దందా

By Siva Kodati  |  First Published Oct 10, 2021, 4:16 PM IST

ఎర్రచందనాన్ని (red sandalwood ) సరిహద్దులు దాటించడంలో కీలక సూత్రధారులైన సాహుల్‌భాయ్‌ (sahul bhai) (దుబాయ్‌), లక్ష్మణ్‌ (lakshman) (కోల్‌కతా)లతో కలిసి అక్రమంగా రవాణా చేస్తున్న అంతర్జాతీయ స్మగ్లర్‌ రామనాథరెడ్డిని చిత్తూరు (chittoor) జిల్లా కుప్పం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. 


ఎర్రచందనాన్ని (red sandalwood ) సరిహద్దులు దాటించడంలో కీలక సూత్రధారులైన సాహుల్‌భాయ్‌ (sahul bhai) (దుబాయ్‌), లక్ష్మణ్‌ (lakshman) (కోల్‌కతా)లతో కలిసి అక్రమంగా రవాణా చేస్తున్న అంతర్జాతీయ స్మగ్లర్‌ రామనాథరెడ్డిని చిత్తూరు (chittoor) జిల్లా కుప్పం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వృత్తి రీత్యా కూరగాయల వ్యాపారి అయిన గుడ్డేటి రామనాథరెడ్డి (ramanatha reddy) కడప జిల్లా చాపాడు మండలం చెండ్లూరుకు చెందిన వ్యక్తి. ఇతను 2007-08లో ఎర్రచందనం అక్రమ రవాణా ప్రారంభించాడు. అనతికాలంలోనే దుంగలను తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌తోపాటు దుబాయ్‌కి ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాడు.   

ఈ నేపథ్యంలోనే చెన్నైలో (chennai) ఎలక్ట్రానిక్స్‌ వ్యాపారం చేస్తున్న సాహుల్‌భాయ్‌తో పరిచయం ఏర్పడింది. ఇక సాహుల్‌ విషయానికి వస్తే ఇతను మొదట్లో బర్మాబజార్‌లో ఎలక్ట్రానిక్స్‌ వ్యాపారం చేసేవాడు. సముద్రమార్గంలో విదేశాలకు దుంగలను స్మగ్లింగ్‌ చేస్తూ దుబాయిలో స్థిరపడ్డాడు. అతనికి రామనాథరెడ్డి 500 టన్నుల దుంగలను పంపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పశ్చిమబెంగాల్‌కు చెందిన లక్ష్మణ్‌ కోల్‌కతా నుంచి చెన్నై, బెంగళూరుకు నిత్యం విమానాల్లో రాకపోకలు సాగిస్తూ ఎర్రచందనం దందా చేస్తున్నాడు. ఇందుకోసం రోజుకు రూ.20 లక్షలు ఖర్చు చేస్తున్నాడంటే అతను ఏ స్థాయిలో స్మగ్లింగ్ చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇదే దందాలో లక్ష్మణ్‌.. రామనాథరెడ్డితో సంబంధాలు కొనసాగిస్తున్నాడు.   

Latest Videos

undefined

ALso Read:భారీ ఎర్రచందనం డంప్ కనుగొన్న టాస్క్ ఫోర్స్.. 348 ఎర్రచందనం దుంగలు స్వాధీనం...

కాగా, కర్నూలు జిల్లాలో 2013లో పట్టుబడిన ఎర్రచంద్రనం  స్మగ్లర్ గంగిరెడ్డికి (gangi reddy) సంబంధించిన 32 టన్నుల దుంగల డంప్‌ కేసులో రామనాథరెడ్డి పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అప్పట్లో అరెస్టై మళ్లీ విడుదల తర్వాత దందా కొనసాగించడంతో 2015, 2017లో రెండుసార్లు అతనిపై పీడీయాక్ట్ నమోదు చేశారు. ఇదే సమయంలో మళ్లీ జైలుకు వెళ్లిన రామనాథరెడ్డి విడుదలై 2019 నుంచి మళ్లీ ఎర్రచందనం స్మగ్లింగ్ ప్రారంభించాడు. ప్రస్తుతం ఏపీలోని అధికార వైసీపీలో(ysrcp) నాయకుడిగా కొనసాగుతూ నెల్లూరు (nellore) నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 

రామనాథరెడ్డిపై కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో 60కిపైగా కేసులున్నాయి. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్‌కుమార్‌ ఆదేశాలతో కుప్పం , నగరి పోలీసులు తమ బృందంతో కలిసి నెలరోజులపాటు నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో శనివారం చిత్తూరు జిల్లా కుప్పం-కృష్ణగిరి రహదారిపై నడుమూరు చెక్‌పోస్టు వద్ద 12 టైర్ల కంటైనర్‌, మరో కారును తనిఖీ చేయగా రూ.50 లక్షల విలువైన 62 దుంగలు పట్టుబడ్డాయి. రామనాథరెడ్డి సహా కడపకు చెందిన గుర్రంపాటి ఈశ్వర్‌రెడ్డి, చిన్నమల్లయ్య, సుంకర భీమయ్యలను అదుపులోకి తీసుకోగా.... మరో స్మగ్లర్‌ ప్రసాద్‌ పారిపోయాడు.

click me!