ఇది ట్రైలర్ మాత్రమే... అసలు సినిమా ముందుంది..: గంటా శ్రీనివాసరావు కౌంటర్

By Arun Kumar P  |  First Published May 30, 2023, 4:58 PM IST

టిడిపి విడుదల చేసిన మినీ మేనిఫెస్టో పై విమర్శలు చేస్తున్న వైసిపి నాాయకులకు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 


విశాఖపట్నం : రాజమండ్రిలో మహానాడు సక్సెస్ తర్వాత ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీలో జోష్ పెరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత పార్టీకి దూరంగా వున్న నాయకులు సైతం ఇటీవల మళ్లీ యాక్టివ్ అయ్యారు. టిడిపి మినీ మేనిఫెస్టో, మహానాడు నిర్వహణపై విమర్శలు చేస్తున్న వైసిపి నాయకులకు అదేస్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు టిడిపి నాయకులు. ఇలా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా వైసిపి నాయకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మహానాడులో విడుదలచేసిన మినీ మేనిఫెస్టో కేవలం ట్రైలర్ మాత్రమే... అసలు సినిమా ముందుంది అంటూ గంటా హెచ్చరించారు. 

ఇవాళ విశాఖపట్నంలోని టిడిపి కార్యాలయంలో టిడిపి చీఫ్ చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసారు నాయకులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గంటా శ్రీనివాసరావు వైసిపి నాయకులపై మండిపడ్డారు. మహానాడు సక్సెస్ ను చూసి వైసిపి నాయకుల్లో అలజడి మొదలయ్యిందని...  మినీ మేనిఫెస్టో కూడా వారి గుబులు మరింత పెంచిందన్నారు. అందువల్లే ఉక్రోశం తట్టుకోలేక టిడిపి మేనిఫెస్టో ను వైసిపి నేతలు చించివేస్తున్నారని అన్నారు. 

Latest Videos

ఏపీ ప్రజలు ఏం కోరుకుంటున్నారో అవే మేనిఫెస్టోలో పొందుపర్చామని...  ఇదే తమకు భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాంటిదని మాజీ మంత్రి గంటా అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు అనేక విప్లవాత్మక పథకాలు ప్రజలకు అందించారని... మళ్ళీ అధికారంలోకి వస్తే ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఇంటింటికి మంచినీరు వంటి మరెన్నో గొప్ప పథకాలను ప్రజలకు అందించనున్నారని అన్నారు. మినీ మెనిఫెస్టోలో పొందుపర్చిన సూపర్ సిక్స్ పథకాలు ప్రజల్లో హాట్ టాపిక్ గా మారాయని గంటా అన్నారు. 

Read More  మొదటి రోజు చెప్పిన దానిని పరిపూర్ణంగా అనుసరిస్తున్నారు.. వైసీపీ నాలుగేళ్ల పాలనపై చంద్రబాబు సెటైరికల్ ట్వీట్..

వైసిపి అధికారంలోకి వచ్చాక ఏపీ మరో అప్ఘానిస్తాన్ లా మారిపోయిందని... అరాచకాలే తప్ప పాలన సాగడం లేదని మాజీ మంత్రి అన్నారు. ఇక ఆర్థిక వ్యవహారాల విషయంలో ఏపీ శ్రీలంకను మించిపోయిందని అన్నారు. ఇప్పటివరకు చేసిన అభివృద్ది ఏమీ లేదు కాబట్టే ప్రతిపక్ష నాయకులను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. ఇప్పటికే జగన్ నుండి ఆయన కుటుంబసభ్యులు దూరం అయ్యారని... ఇక అధికారం కూడా దూరమయ్యే రోజులు దగ్గర్లోనే వున్నాయన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా... ఎప్పుడెప్పుడు టిడిపిని అధికారంలోకి తీసుకురావాలా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. 
 

click me!