పిచ్చిముదిరింది.. ఏకగ్రీవాలు ఇప్పుడే మొదలయ్యాయా: నిమ్మగడ్డపై వల్లభనేని వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Feb 7, 2021, 4:40 PM IST
Highlights

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని హౌస్ అరెస్ట్ చేస్తూ ఆదేశాలు జారీ చేయడం, వీటిని హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై మండిపడుతున్నారు వైసీపీ నేతలు. తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. నిమ్మగడ్డపై విరుచుకుపడ్డారు.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని హౌస్ అరెస్ట్ చేస్తూ ఆదేశాలు జారీ చేయడం, వీటిని హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై మండిపడుతున్నారు వైసీపీ నేతలు.

తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. నిమ్మగడ్డపై విరుచుకుపడ్డారు. నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌కు పిచ్చి ముదిరిందని, నియంతృత్వ పోకడలకు పోతున్నారని ఆయన విమర్శించారు.

ఫిర్యాదులు వస్తే పరిశీలించాలి కానీ.. గృహ నిర్బంధం విధించడం ఏమిటని దుయ్యబట్టారు. విచారణ జరపకుండా అనామకుల కంప్లైంట్లపై నిమ్మగడ్డ ఎలా స్పందిస్తారు? చంద్రబాబు చెప్పగానే చర్యలు తీసుకుంటారా అని వంశీ నిలదీశారు.

Also Read:భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే: నిమ్మగడ్డకు కాకాని హెచ్చరిక

ఎస్ఈసీ చర్యలకు అన్నీ సరిపెడతామని.. ఏకగ్రీవాలనేవి కాసు బ్రహ్మానంద రెడ్డి కాలం నుంచే ఉన్నాయని వల్లభనేని గుర్తుచేశారు. ఏకగ్రీవాలకు ప్రోత్సహకాల జీవో ఇచ్చింది చంద్రబాబేనని.. కొత్తగా ఈ రోజే ఏకగ్రీవాలు జరుగుతున్నట్టు టీడీపీ అధినేత మాట్లాడుతున్నారని వంశీ ఎద్దేవా చేశారు.

టీడీపీ ఏకగ్రీవాలు కూడా బలవంతమేనా అంటూ ఆయన చురకలంటించారు. గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ తరపున పోటీ చేసే అభ్యర్థులు లేరని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేర్కొన్నారు.

click me!