సుంకర పద్మశ్రీపై పరువునష్టం దావా వేస్తా: వంశీ

First Published Jul 26, 2018, 3:49 PM IST
Highlights

తనపై ఏపీ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ చేసిన ఆరోపణలపై గన్నవరం ఎమ్మెల్యే  వల్లభనేని వంశీ మోహన్ తీవ్రంగా స్పందించారు.  తనపై తప్పుడు ఆరోపణలు చేసిన  పద్మశ్రీపై  పరువునష్టం దావా వేయనున్నట్టు ఆయన ప్రకటించారు.

గన్నవరం: తనపై ఏపీ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ చేసిన ఆరోపణలపై గన్నవరం ఎమ్మెల్యే  వల్లభనేని వంశీ మోహన్ తీవ్రంగా స్పందించారు.  తనపై తప్పుడు ఆరోపణలు చేసిన  పద్మశ్రీపై  పరువునష్టం దావా వేయనున్నట్టు ఆయన ప్రకటించారు.

గురువారం నాడు  ఏపీ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ చేసిన ఆరోపణలపై ఆయన స్పందించారు. బుధవారం నాడు ఆతుకూరు గ్రామంలో  జరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో జరిగిన కార్యక్రమంలో మరియంబీ అనే మహిళ  తన వద్దకు వచ్చి సుంకర పద్మశ్రీపై ఫిర్యాదు చేసిందన్నారు.ఈ విషయం వాస్తవమైతే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించినట్టు చెప్పారు.

అయితే  సుంకర పద్మశ్రీపై తాను కేసు నమోదు చేయించేలా చేసినట్టు ఆమె చేసిన ఆరోపణలను ఆయన  ఖండించారు. సుంకర పద్మశ్రీపై తనకు వ్యక్తిగత కక్షలు లేవన్నారు. గన్నవరం నియోజకవర్గంలో  వైసీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలపై అక్రమంగా కేసులు నమోదు చేయించినట్టు రుజువు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.  

తనపై  సుంకరపద్మశ్రీ అనవసర ఆరోపణలు చేశారని ఆయన చెప్పారు.  తనపై తప్పుడు ఆరోపణలు  చేశారని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ చెప్పారు. ఈ ఆరోపణలు చేసినందుకుగాను పద్మశ్రీపై  పరువునష్టం దావా వేయనున్నట్టు వంశీ చెప్పారు. పద్మశ్రీపై గతంలో అనేక కేసులున్న విషయాన్ని కూడ ఆయన గుర్తు చేశారు.  పద్మశ్రీపై కేసు నమోదు చేయించాల్సిన అవసరం తనకు లేదన్నారు.

 

ఈ వార్త చదవండి. వల్లభనేనిపై సుంకర పద్మశ్రీ తీవ్ర విమర్శలు

ఏపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ‌పై కేసు నమోదు

 

click me!