టీడీపీలో నెంబర్ వన్ ఇక వల్లభనేని వంశీనే

First Published May 12, 2018, 2:30 PM IST
Highlights

సీనియర్లను వెనక్కి తోసేసి.. టాప్ లో నిలిచిన వంశీ

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టాప్ గేర్ లో దూసుకుపోతున్నారు. సీనియర్లను వెనక్కి నెట్టి మరీ ఫస్ట్ ప్లేస్ దక్కించుకున్నారు. పార్టీ అధినేత, సీఎం  చంద్రబాబు ముందు మంచి మార్కులు కొట్టేశాడు. ఇంతకీ విషయం ఏమిటంటే.. సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలపై వారికి తెలియకుండా ఓ పరీక్ష పెట్టారు. ఆ పరీక్షలో  ర నలుగురు ఎమ్మెల్యేలు టాప్‌ గ్రేడ్‌ కొట్టేశారు. మిగిలిన వారిలో కొందరికి ఫస్ట్‌క్లాస్‌ రాగా, ఇంకొందరు సగటు మార్కులతో గట్టెక్కారు. 

కృష్ణా జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల పనితీరును అంచనా వేసేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు రహస్యంగా నిర్వహించిన పరీక్ష (సర్వే) ఫలితాలను గురువారం ఎమ్మెల్యేల సమావేశంలో వెల్లడించారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ 79.66 శాతం మార్కులతో నెం.1 స్థానంలో నిలిచారు. ఆయన తరువాత స్థానంలో 70 శాతం పైబడిన మార్కులతో పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాంతాతయ్య ఉన్నారు. జిల్లాకు చెందిన మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్రలకు 60 శాతం మార్కులే వచ్చాయి.

ఎమ్మెల్యేల పని తీరు ఎలా ఉంది? కార్యకర్తలకు అందు బాటులో ఉంటున్నారా? పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్నారా? ప్రజా సమస్యల పరిష్కారంలో శ్రద్ధ చూపుతున్నారా? నియోజకవర్గంలోని నాయకులందరిని సమన్వయంతో కలుపుకెళ్తున్నారా లేదా? సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరిగే విధంగా పర్యవేక్షిస్తున్నారా? అనే ఐదు ప్రశ్నలకు కార్యకర్తల నుంచి సమాధానాలు సేకరించారు. వారి సమాధానాల ఆధారంగా వారికి గ్రేడ్ లు ఇచ్చారు. కాగా.. అందరి కన్నా వయసులో చిన్నవాడైనా.. పనితీరులో మాత్రం భేష్ గా ఉన్నట్లు వంశీ తనను తాను నిరూపించుకున్నాడు.
 

click me!