అంతమాత్రాన పార్టీలో చేరిపోతారా..?: జగన్ తో నాగార్జున భేటీపై గల్లా జయదేవ్

By Nagaraju penumalaFirst Published Feb 19, 2019, 6:24 PM IST
Highlights

గుంటూరు నుంచి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో నాగార్జున వస్తే తనకు ఇబ్బంది కలుగుతుందనుకున్నారో ఏమో ఏకంగా ఆయన రాజకీయాల్లోకి రారు అంటూ స్టేట్మెంట్ ఇచ్చేశారు. వైఎస్ జగన్ ను నాగార్జున కలిసినంత మాత్రాన వైసీపీలో చేరినట్లేనా అంటూ ప్రశ్నించారు. 
 


గుంటూరు: సినీనటుడు అక్కినేని నాగార్జున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడంపై రాజకీయ వర్గాల్లో గుబులు రేపుతోంది. అక్కినేని నాగార్జున వైసీపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అటు వైసీపీలోనూ ఇటు తెలుగుదేశం పార్టీలోనూ జోరుగా చర్చ జరుగుతుంది. 

నాగార్జున పార్టీలో చేరడంతోపాటు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తారంటూ ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం టీడీపీ, వైసీపీ నేతల మధ్య జోరుగా చర్చ జరుగుతోంది. 

నాగార్జున పార్టీ తీర్థం పుచ్చుకుంటే తమ పరిస్థితి ఏంటని గుసగుసలు ఆడుకుంటున్నారట. ఇన్నాళ్లు పార్లమెంట్ సమన్వయకర్తగా పనిచేసిన తమకు నాగార్జున ఎసరుపెడతారా ఏంటని ఆరా తీస్తున్నారట. ఇకపోతే గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అయితే నాగార్జున వైసీపీలో చేరే అంశంపై వెంటనే స్పందించారు. 

గుంటూరు నుంచి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో నాగార్జున వస్తే తనకు ఇబ్బంది కలుగుతుందనుకున్నారో ఏమో ఏకంగా ఆయన రాజకీయాల్లోకి రారు అంటూ స్టేట్మెంట్ ఇచ్చేశారు. వైఎస్ జగన్ ను నాగార్జున కలిసినంత మాత్రాన వైసీపీలో చేరినట్లేనా అంటూ ప్రశ్నించారు. 

నాగార్జున తనకు చాలా మంచి స్నేహితుడు అని గల్లా జయదేవ్ చెప్పుకొచ్చారు. ఆయన రాజకీయాల్లోకి రారని భావిస్తున్నట్లు తెలిపారట. రాష్ట్రంలో జరుగుతున్న వలసలపై స్పందించిన ఆయన గెలవలేని వారే పార్టీలు మారుతున్నారంటూ చెప్పుకొచ్చారు. మెుత్తానికి అక్కినేని నాగార్జున వైఎస్ జగన్ ను కలవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.  


 

click me!