గల్లా అరుణ పార్టీ మారరు: జయదేవ్

First Published Jun 6, 2018, 3:51 PM IST
Highlights

క్లారిటీ ఇచ్చిన జయదేవ్

గుంటూరు: మాజీ మంత్రి గల్లా అరుణకు పార్టీ మారే ఉద్దేశం లేదని  గుంటూరు ఎంపీ జయదేవ్ చెప్పారు.పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారని ఆయన చెప్పారు. గుంటూరులో బుధవారం
నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి ఇంఛార్జీ బాధ్యతల నుండి గల్లా అరుణకుమారి ఇటీవల కాలంలో తప్పుకొన్నారు.


పార్టీ నాయకత్వం గల్లా అరుణకుమారికి సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే కారణంగానే ఆమె ఈ బాధత్యతల నుండి తప్పుకొన్నారని పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. అయితే కార్యకర్తలతో
ఆమె సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకొంది. ఈ తరుణంలో ఈ విషయమై  గుంటూరు ఎంపీ జయదేవ్ మీడియాతో ఈ విషయమై మాట్లాడారు.పార్టీ మారాలనే ఉద్దేశ్యం
అరుణకుమారికి లేదన్నారు. గత ఎన్నికల్లో ఆమె చంద్రగిరి అసెంబ్లీ స్థానం నుండి టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినా ఆమెకే పార్టీ  ఇంఛార్జీ బాధ్యతలను అప్పగించారు.

రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం ఉన్నప్పటికీ నియోజకవర్గంలో తాను చెప్పిన విషయాలను పార్టీ నేతలు పట్టించుకోవడం లేదనే అసంతృప్తి అరుణకుమారిలో ఉందని ఆమె వర్గీయులు
చెబుతున్నారు. అంతేకాదు  తాను చెప్పిన వారికి కూడ పదవులను కట్టబెట్టడం లేదనే వాదన కూడ లేకపోలేదు దీంతో  ఆమె అసంతృప్తితో టిడిపి చంద్రగిరి అసెంబ్లీ ఇంఛార్జీ బాధ్యతల నుండి
తప్పుకొన్నారు.

చంద్రగిరి టిడిపి ఇంఛార్జీ బాధ్యతల నుండి అరుణ తప్పుకోకూడదని పార్టీ నాయకత్వం సూచించింది. అయినా ఆమె మాత్రం తన పట్టుదలను వీడలేదు. ఈ సమయంలో ఆమె తన
అనుచరులు, పార్టీ కార్యకర్లలతో సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.


మరో వైపు  బీజేపీ, వైసీపీ కుమ్మకై  రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాయని గల్లా జయదేవ్ చెప్పారు.  ఉప ఎన్నికలు రావనే ఉద్దేశ్యంతోనే వైసీపీ ఎంపీలు రాజీనామాలను ఆమోదించుకొన్నారని ఆయన చెప్పారు.రాజకీయ ప్రయోజనాల కోసమే వైసీపీ, బిజెపిలు ప్రయత్నిస్తున్నాయని ఆయన చెప్పారు.


 

 

click me!