గడప గడపకు మన ప్రభుత్వంలో 32 మంది ఎమ్మెల్యేల పనితీరుపై ఏపీ సీఎం వైఎస్ జగన్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది మార్చి లోపుగా తమ పనితీరును మెరుగుపర్చుకోవాలని ఆదేశించారు. అప్పటికి పనితీరు మార్చుకోకపోతే కొత్తవారిని బరిలోకి దింపుతామని సీఎం తేల్చి చెప్పారు.
అమరావతి: గడప గడపకు మన ప్రభుత్వంలో 32 మంది ఎమ్మెల్యేల పనితీరుపై ఏపీ సీఎం వైఎస్ జగన్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. తమ పనితీరును మెరుగు పర్చుకోవాలని సీఎం ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి లోపుగా తమ పనితీరును మెరుగుపర్చుకోవాలన్నారు. సీఎం జగన్. అప్పటికి పనితీరు మార్చుకోకపోతే కొత్త అభ్యర్ధులను బరిలోకి దింపుతామని సీఎం తేల్చి చెప్పారు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై వైసీపీకి చెందిన ప్రజా ప్రతినిధులతో ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారంనాడు తాడేపల్లిలో సమీక్ష నిర్వహించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఎలా పాల్గొంటున్నారనే విషయమై సీఎం జగన్ నివేదికను తెప్పించుకున్నారు. ఈ నివేదిక ఆధారంగా సీఎం జగన్ ఇవాళ ఆయా ఎమ్మెల్యేల పనితీరును సమీక్షించారు. గత సమీక్ష సమావేశంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో 27 మంది ఎమ్మెల్యేలు వెనుకబడ్డారు.కొందరు ప్రజా ప్రతినిధులు ఈ విషయాన్ని సీరియస్ గా పట్టించుకోవడం లేదని సీఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
undefined
also read:గడప గడపకు మన ప్రభుత్వంపై రేపు సమీక్ష: జగన్‌కి చేరిన నివేదికలు
రెండున్నర నెలల తర్వాత గడప గడపకు మన ప్రభుత్వంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కనీసం నెల రోజుల పాటు ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని గత సమావేశంలోనే సీఎం జగన్ చెప్పారు. కానీ ఈ విషయాన్ని కొందరు ప్రజా ప్రతినిధులు అంత సీరియస్ గా తీసుకోలేదు. పది రోజుల లోపుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు 32 మంది ఉన్నారని నివేదిక తేలింది. ఈ నివేదికను ఐ ప్యాక్ సంస్థకు చెందిన రిషి వివరించారు. ఈ నివేదిక ఆధారంగా సీఎం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేసిన ప్రజా ప్రతినిధులపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రతి రోజూ ఒక సచివాలయం పరిధిలో ఆరు నుండి ఎనిమిది గంటల పాటు పర్యటించాలని సీఎం సూచించారు. కానీ కొందరు ప్రజా ప్రతినిధులు గంట నుండి రెండు గంటల లోపే ఆయా సచివాలయాల పరిధిలో పర్యటించారు. ఇలా 30 రోజులను పూర్తి చేసిన వారి జాబితాను కూడా సమావేశంలో బయట పెట్టారు. ఇలా గంట పాటు పర్యటనలు చేసిన ప్రజా ప్రతినిధుల సంఖ్య 20గా ఉందని ఈ నివేదిక తేల్చింది. వచ్చే ఏడాది మార్చిలో గడప గడపకు మన ప్రభుత్వం వర్క్ షాప్ నిర్వహించనున్నట్టుగా సీఎం ప్రకటించారు.
అప్పటిలోపుగా పనితీరును మెరుగు పర్చుకోకపోతే ప్రత్యామ్నాయాన్ని చూసుకుంటానని సీఎం తేల్చి చెప్పారు. మిమ్మల్ని మార్చాలనే ఉద్దేశ్యం తనకు లేదని చెబుతూనే ఈ పరిస్థితిని మీరే తెచ్చుకొంటున్నారని వైసీపీ ప్రజా ప్రతినిధులనుద్దేశించి సీఎం వ్యాఖ్యలు చేశారు.గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సరైన పనితీరు చూపని ప్రజా ప్రతినిధుల్లో ప్రస్తుత మంత్రులు, మాజీ మంత్రుల పేర్లు కూడా ఉన్నాయని సమాచారం.
ఆయా గ్రామాల్లో ప్రజలకు ఏ రకమైన పనులు ఏమి అవసరం ఉందో కూడా ప్రజా ప్రతినిధులు గుర్తించలేదు. ప్రతి సచివాలయానికి సీఎం జగన్ రూ. 20 లక్షలను మంజూరు చేశారు. ప్రాధాన్యత క్రమంలో ఆయా సచివాలయాల్లో పనులను గుర్తించలేదని సీఎం వివరించారు.ప్రతి సచివాలయంలో ముగ్గురు కన్వీనర్లను ఈ నెల 25 లోపుగా నియమించాలని సీఎం ప్రజా ప్రతినిధులను కోారు. వచ్చే ఏడాది జనవరి 25 లోపుగా గృహ సారధులను నియమించాలని సీఎం పార్టీ ప్రజా ప్రతినిధులను ఆదేశించారు.కొత్త సంవత్సరం రోజున ప్రభుత్వం నుండి లబ్ది పొందిన లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం జగన్ పేరుతో ఉత్తరాలు రాయనున్నారు.ఈ లేఖలను లబ్దిదారులకు అందించేలా చూడాలని సీఎం కోరారు.