
‘తనలోని లోపాలను తెలుసుకున్నవాడు మహాజ్ఞాని’ అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ లెక్కన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ కుడా మహాజ్ఞాని క్రిందే లెక్క. ఎందుకంటే తనలోని లోపాలను తాను తెలుసుకున్నారట. ఆ విషయాన్ని మంగళవారం స్వయంగా ఆయనే చెప్పుకున్నారు. టిడిపి ఆధినాయకత్వం మంగళవారం వ్యక్తిత్వ విశ్లేషణ పరీక్షను నిర్వహించింది లేండి. శాంపుల్ గా నిర్వహించిన ఫలితాలు బాగుంటే గ్రామస్ధాయి వరకు ఇటువంటి పరీక్షలు జరపాలన్నది చంద్రబాబునాయుడు ఆలోచన.
అదే సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, ‘ప్రతీ మనిషిలో కొన్ని లోపాలుంటాయి. సవరించుకోగలిగినంత వరకూ సవరించుకోగలిగితే ఆ వ్యక్తి నుండి మంచి ఫలితాలు రాబట్టే అవకాశాలు పెరుగుతాయ’న్నారు. అని చెబుతూనే తాను ముందుగా ఈ పరీక్షలో పాల్గొని విశ్లేషణ తీసుకున్నట్లు చెప్పారు. అందులో తన లోపాలేంటో తనకు తెలిసాయట. వాటిని సవరించుకోవటానికి మనస్తత్వ విశ్లేషకుడి వద్ద శిక్షణ తీసుకుంటున్నట్లు కుడా లోకేష్ వివరించారు. అంటే లోకేష్ చెప్పినదాని ప్రకారమే ‘లోపాలను తెలుసుకున్నవాడు, సవరించుకుంటున్న వాడు’ మమాజ్ఞానే కదా? సరిగ్గా ఎన్నికలకు ముందు లోపాలను తెలుసుకుని, సవరించుకోవటం కన్నా కావాల్సింది ఇంకేముంటుంది?