సైబర్ నేరగాళ్ల మాయలు: బాధితుడిగా మారిన డీఎస్పీ

By Siva KodatiFirst Published Dec 9, 2020, 5:47 PM IST
Highlights

అనంతపురం జిల్లాలో పోలీస్ అధికారులకు సైబర్ కేటుగాళ్లు తలనొప్పులుగా మారారు. పోలీస్ అధికారుల పేరుతో ఫేస్‌బుక్‌లో ఖాతాలు రూపొందించి, అందినకాడికి వసూళ్లకు పాల్పడుతున్నారు.

అనంతపురం జిల్లాలో పోలీస్ అధికారులకు సైబర్ కేటుగాళ్లు తలనొప్పులుగా మారారు. పోలీస్ అధికారుల పేరుతో ఫేస్‌బుక్‌లో ఖాతాలు రూపొందించి, అందినకాడికి వసూళ్లకు పాల్పడుతున్నారు.

ఫేస్‌బుక్ ఖాతాల్లో ఎవరికి ఎక్కువ ఫాలోవర్స్ వున్నారో తెలుసుకుంటున్న కేటుగాళ్లు వారి పేరుతో నకిలీ ఖాతాలు క్రియేట్ చేస్తున్నారు. ఇలాగే జిల్లాలో బాగా ఫాలోయింగ్ వున్న దిశ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ను సృష్టించారు.

ఆ తర్వాత డబ్బు కావాలంటూ దాని నుంచి పలువురికి మేసేజ్‌లు పెడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన కొందరు డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సైబర్ పోలీసులను ఆశ్రయించారు. సైబర్ నేరగాళ్లు తమ పేరుతో డబ్బులు అడుగుతున్నట్లు తెలిసిందని.. దీనిని నమ్మి ఎవరూ మోసపోవద్దని ఆయన కోరుతున్నారు. 
 
click me!