ఏలూరు మిస్టరీ: కేంద్ర బృందంతో జగన్ సమీక్ష

By Siva KodatiFirst Published Dec 9, 2020, 5:20 PM IST
Highlights

ఏలూరులో అంతుచిక్కని వ్యాధి ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన.. బాధితులు త్వరగా కోలుకుంటున్నారని సీఎంకు వైద్య బృందం తెలిపింది

ఏలూరులో అంతుచిక్కని వ్యాధి ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన.. బాధితులు త్వరగా కోలుకుంటున్నారని సీఎంకు వైద్య బృందం తెలిపింది.

అస్వస్థతకు కారణాలు తెలుసుకోవాలని సూచించారు జగన్. మరోవైపు కేంద్ర బృందాలతోనూ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు జగన్. మరోవైపు పాలు, నీరు, కూరగాయల చుట్టూ తిరుగుతోంది ఏలూరు మిస్టరీ.

నీటిలో పెస్టిసైడ్స్ ఉన్నట్లు గుర్తించడంతో పాటు బాధితుల రక్త నమూనాల్లో సీసం, నికెల్ అవశేషాలు ఉన్నాయని ఇప్పటికే పరీక్షల్లో తేలింది. దీంతో పెస్టిసైడ్స్ ఎక్కువగా చల్లిన కూరగాయలు తిన్నారా లేక అలాంటి పశుగ్రాసం తిన్న పాడి పశువుల పాలు తాగారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

క్షేత్ర స్థాయిలో వివిధ ప్రాంతాల్లో పేషెంట్స్ తిన్న ఆహార నమూనాలను పరీక్షిస్తున్నారు. మరోవైపు ఏలూరులో మంచినీటి సరఫరా తీరును పరీక్షించింది ఎయిమ్స్ వైద్యుల బృందం.

ఏలూరు పరిసర ప్రాంతాలకు నీటి సరఫరా జరిగే పంపులు, చెరువులను పరిశీలించింది. నీటి శుద్ధి కోసం క్లోరిన్‌ను ఎంత మేరకు కలుపుతున్నారన్నది తెలుసుకుంది డాక్టర్ల బృందం. రెండు సార్లు సేకరించిన శాంపిల్స్‌లో సీసం ఉన్నట్లు గుర్తించింది ఎయిమ్స్ బృందం. 

click me!