విజయవాడ రాహుల్ హత్య కేసు: గాయత్రికి 14 రోజుల రిమాండ్.. 12కి చేరిన అరెస్ట్‌ల సంఖ్య

By Siva KodatiFirst Published Sep 3, 2021, 7:47 PM IST
Highlights

విజయవాడలో సంచలనం సృష్టించిన పారిశ్రామిక వేత్త రాహుల్ హత్య కేసులో నిందితురాలిగా వున్న గాయత్రికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఈమెతో కలిపి ఈ కేసులో మొత్తం అరెస్ట్‌ల సంఖ్య 12కి చేరింది. 

విజయవాడలో సంచలనం సృష్టించిన పారిశ్రామిక వేత్త రాహుల్ హత్య కేసులో నిందితురాలిగా వున్న గాయత్రికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. కోరాడ చిట్‌ఫండ్స్ కంపెనీలో ఆమె పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్ హత్య కేసులో ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. 

కాగా, రాహుల్ కరణం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా వున్న కోగంటి సత్యంను రెండు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోగంటి సత్యంను ప్రశ్నిస్తే ఈ కేసులో మరిన్ని వివరాలు బయటకొచ్చే అవకాశం వుందని పోలీసులు భావిస్తున్నారు. రాహుల్ హత్య కేసులో ఇప్పటి వరకు మొత్తం 11 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. అలాగే మరో ఇద్దరు నిందితుల కోసం రెండు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. 

Also Read:విజయవాడ రాహుల్ హత్య కేసు: పోలీస్ కస్టడీకి కోగంటి సత్యం.. కోర్ట్ అనుమతి

కాగా, వ్యాపార లావాదేవీలే జిక్సిన్ సిలిండర్ల వ్యాపారి కరణం రాహుల్ హత్యకు కారణమని విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు చెప్పారు. జిక్సిన్ సిలిండర్ల ఫ్యాక్టరీ ఎండీ కరణం రాహుల్ హత్య కేసులో  ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినట్టుగా ఆయన తెలిపారు. శుక్రవారం నాడు ఆయన విజయవాడలో తన కార్యాలయంలో  మీడియాతో మాట్లాడారు.   కారులో డ్రైవింగ్ సీట్లో కూర్చొన్న రాహుల్ ను వెనుక నుండి సెల్‌ఫోన్ ఛార్జింగ్ వైర్ తో చంపారని  సీపీ చెప్పారు.  ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురిని అరెస్ట్ చేసినట్టుగా సీపీ తెలిపారు.

click me!