జగనన్న విద్యా దీవెన.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్

By Siva KodatiFirst Published Sep 3, 2021, 6:48 PM IST
Highlights

జగనన్న విద్యా దీవెన పథకం చెల్లింపులకు సంబంధించి ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. విద్యా దీవెన డబ్బులు విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్‌ అకౌంట్లలో జమ చేయాల్సిందేనని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. నేరుగా కాలేజీల ఖాతాల్లో డబ్బులు జమ అవ్వాలని సంబంధిత అధికారులను హైకోర్టు ఆదేశించింది

జగనన్న విద్యా దీవెన పథకం చెల్లింపులకు సంబంధించి ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. విద్యా దీవెన కార్యక్రమం కింద తల్లుల బ్యాంక్ అకౌంట్లలో ప్రభుత్వం డబ్బులు జమ చేస్తోంది. అయితే తల్లులు ఫీజు చెల్లించకపోతే తమకు సంబంధం లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ క్రమంలో ఫీజులను కాలేజీ ప్రిన్సిపాల్ ఖాతాల్లో జమ చేయాలని న్యాయవాది మతుకుమిల్లి శ్రీవిజయ్ హైకోర్టును ఆశ్రయించారు. కృష్ణదేవరాయ విద్యా సంస్థల తరపున హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయస్థానంలో శుక్రవారం విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం హైకోర్టు తీర్పు వెలువరించింది. విద్యా దీవెన డబ్బులు విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్‌ అకౌంట్లలో జమ చేయాల్సిందేనని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. నేరుగా కాలేజీల ఖాతాల్లో డబ్బులు జమ అవ్వాలని సంబంధిత అధికారులను హైకోర్టు ఆదేశించింది

click me!