గోదావరిలో దూకి ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య: ఇద్దరి పిల్లల మృతదేహలు లభ్యం

By narsimha lodeFirst Published Aug 1, 2021, 3:47 PM IST
Highlights


సమీప బంధువుల వేధింపుల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకొన్నారు. ఇద్దరు పిల్లలు సహా దంపతులు గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకొన్నారు. పిల్లల మృతదేహలను ఇవాళ పోలీసులు గోదావరిలో గుర్తించారు.


రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం మొగలికుదురు గ్రామానికి చెందిన నలుగురు కుటుంబసభ్యులు చించినాడ బ్రిడ్జి పై నుంచి గోదావరిలో దూకి  ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు పిల్లల మృతదేహలను పోలీసులు వెలికితీశారు. భార్యాభర్తల మృతదేహల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

 ఒకే కుటుంబానికి చెందిన సతీష్(34) ఆయన బార్య సంధ్య(28) కుమారుడు జస్వన్ (4)కుమార్తె జైశ్రీ దుర్గ(2)  రెండు రోజులుగా అదృశ్యమయ్యారు. తమ కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అదృశ్యమయ్యారంటూ వారి కుటుంబ సభ్యులు పాలకొల్లు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో శనివారం నాడు ఫిర్యాదు చేశారు.

సతీష్ ఉపయోగించినట్లు భావిస్తున్న మోటార్‌ సైకిల్‌తో పాటు, పిల్లల దుస్తులు జిల్లాలోని యలమంచిలి మండలం చించినాడ వంతెనపై పోలీసులు శనివారం ఉదయం స్వాధీనం చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా దిండి రిసార్ట్స్ వద్ద పాప జై శ్రీ దుర్గ బాడీని పోలీసులు గుర్తించారు.  మిగతా వారి ఆచూకి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

అయితే తమ చావుకు  సమీప బంధువులే కారణమని సంధ్య పేరుతో రాసిన సూసైడ్ లేఖ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.తమ బంధువులు వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తున్నామని ఆమె ఆ లేఖలో రాసింది. దుబాయ్‌లో ఉండే సతీష్ ఇటీవలనే స్వగ్రామానికి వచ్చాడు.  అయితే వీరి కుటుంబంలో ఉన్న గొడవల గురించి  ఈ నలుగురు మరణించారా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

click me!