కైలాసగిరిపై యువతిపై సామూహిక అత్యాచారం

Published : Oct 31, 2019, 07:22 AM IST
కైలాసగిరిపై యువతిపై సామూహిక అత్యాచారం

సారాంశం

సుమారు 22 సంవత్సరాలు కలిగిన యువతి, పద్దెనిమిది సంవత్సరాల వయసు కలిగిన బాలుడు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో కైలాసగిరిపైకి చేరుకున్నారు. కాసేపు అటుఇటు తిరిగారు. ఆ తరువాత బాలుడు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఆమెకు ఇచ్చాడు. అనంతరం అత్యాచారానికి పాల్పడ్డాడు. 

విశాఖ నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కైలాసగిరిలో దారుణం చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం ఓ యువతిపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. పర్యాటక ప్రాంతానికి సందర్శించడానికి వెళ్లిన యువతిపై ఒకరి తర్వాత ఒకరు దారుణానికి పాల్పడ్డారు.

ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.... సుమారు 22 సంవత్సరాలు కలిగిన యువతి, పద్దెనిమిది సంవత్సరాల వయసు కలిగిన బాలుడు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో కైలాసగిరిపైకి చేరుకున్నారు. కాసేపు అటుఇటు తిరిగారు. ఆ తరువాత బాలుడు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఆమెకు ఇచ్చాడు. అనంతరం అత్యాచారానికి పాల్పడ్డాడు. 

ఆ తరువాత అతను తన స్నేహితులు ముగ్గురిని (అందులో ఇద్దరు మైనర్లు, మరొకరు గురివిల్లి రమణ) రప్పించాడు. వారు కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. భద్రతలో భాగంగా ఆ ప్రాంతానికి వెళ్లిన పోలీసులు...ఆ యువకులను అదుపులోకి తీసుకున్నారు. అపస్మారక స్థితిలో వున్న యువతిని ఆస్పత్రికి తరలించారు. నిందితులు నలుగురిపై కేసు నమోదు చేసినట్టు ఆరిలోవ సీఐ కిషోర్‌కుమార్‌ తెలిపారు. అంతా జోడుగుళ్లపాలేనికి చెందినవారని తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం