రైతును చెప్పుతో కొట్టబోయిన వైసీపీ ఎమ్మెల్యే బొల్లా...

By SumaBala BukkaFirst Published Jan 8, 2022, 9:57 AM IST
Highlights

ఆ సమయంలో స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎంపీ ఎదుటే  తన కాలికి ఉన్న చెప్పులు తీసి  రైతును  కొట్టే ప్రయత్నం చేశాడు. అయితే, సదరు రైతు ధైర్యంగా ఎదురు తిరిగాడు. గురువారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

గుంటూరు : నోటిదురుసు నేతగా గుంటూరు జిల్లాలో పేరొందిన వినుకొండ ఎమ్మెల్యే Bolla Brahmanayuḍu మరోసారి రచ్చ చేశారు. వరికి గిట్టుబాటు ధర లేదని, ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆర్ బికే ల ద్వారా  కొనడం లేదని  ఓ farmer ఆవేదన వ్యక్తం చేశాడు. తమ గ్రామానికి వచ్చిన నరసరావుపేట ఎంపీ Lavu Srikrishnadevarayas ఎదుట ఈ మేరకు వాపోయారు. అయితే, ఆ సమయంలో స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎంపీ ఎదుటే  తన కాలికి ఉన్న Sandals తీసి  రైతును కొట్టే ప్రయత్నం చేశాడు. అయితే, సదరు రైతు ధైర్యంగా ఎదురు తిరిగాడు. గురువారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామంలో వైసీపీకి చెందిన ఓ నేత కుటుంబ సభ్యుడు చనిపోయారు.  దీంతో ఈ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎంపీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వచ్చారు.  

ఈ సందర్భంగా వైసీపీ నాయకుడు,రైతు గడిపూడి నరేంద్ర వరి రైతుల ఇబ్బందులను ఎంపీకి విన్నవించారు. రైతు భరోసా కేంద్రాల్లో రూ.1,450 ధర కల్పించినా కొనడం లేదని ఎంపీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఎంపీ ఫోన్లో జాయింట్ కలెక్టర్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లారు. వెంటనే ఆయన వ్యవసాయ శాఖ అధికారులను అక్కడికి పంపించారు.  ఎంపీ వారితో మాట్లాడి రెండు రోజుల్లో ఆర్ బీకే ద్వారా ఆ గ్రామంలో వరిని కొనుగోలు చేస్తామని అధికారుల చేత చెప్పించారు.

అయితే అదే సమయంలో రైతు నరేంద్ర మాట్లాడుతూ..  ఆర్ బీకేల ద్వారా కొనుగోలు చేసే ధాన్యానికి డబ్బులు ఇస్తామని భరోసా ఎవరు ఇస్తారని..  ఎంపీని ప్రశ్నించారు.  ఈ సమయంలో పక్కనే ఉన్న ఎమ్మెల్యే బొల్లా ఒక్క ఉదుటన లేచి ‘ ఏంట్రా.. నా.. కొడకా.. నీకు భరోసా ఇచ్చేది’ అంటూ తన కాలి చెప్పులు తీసుకుని  నరేంద్రను కొట్టేందుకు దూసుకెళ్లారు.  

అయితే,  నరేంద్ర కూడా ఎదురుతిరిగి. ‘ మేమూ  కొట్టగలం’  అనడంతో ఎమ్మెల్యే పోలీసులను పిలిపించి రైతును లాకప్లో వేయించారు. గురువారం సాయంత్రం ఈ ఘటన జరగగా శుక్రవారం రాత్రి వరకు కూడా రైతును పోలీసులు విడిచి పెట్టలేదని తెలిసింది.  ఇదిలా ఉంటే,  ఈ ఘర్షణను అక్కడున్న వారు సెల్ఫోన్లలో చిత్రీకరించే ప్రయత్నం చేయగా వారి నుంచి ఎమ్మెల్యే మనుషులు బలవంతంగా ఫోన్లు లాక్కొని వాటిని డిలీట్ చేసినట్లు సమాచారం.

కాగా, నిరుడు జూన్ లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కు హైకోర్టు  నోటీసులు జారీ చేసింది. వినుకొండ పట్టణంలోని సురేష్ మహల్ రోడ్డులో ఆక్రమణల తొలగింపుతో నష్టపోయిన బాధితులు కోర్టును ఆశ్రయించారు. బాధితుల పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ముందస్తు నోటీసులు లేకుండా అర్దాంతరంగా కూల్చివేయడాన్ని తప్పుబట్టింది. ఈ క్రమంలోనే స్థానిక ఎమ్మెల్యేతో పాటు వినుకొండ మున్సిపల్ కమిషనర్ కు కోర్టు దిక్కరణ నోటీసులు జారీ చేశారు.  

click me!