విషాదం: ఒకే కుటుంబంలో నలుగురి సజీవ దహనం

Published : Nov 11, 2018, 09:26 AM IST
విషాదం: ఒకే కుటుంబంలో నలుగురి సజీవ దహనం

సారాంశం

చిత్తూరు జిల్ల ఏర్పేడు మండలంం రాజులకండ్రిగలో ఒకే కుటుంబంలోని నలుగురు అనుమానాస్పద స్థితిలో ఆదివారం నాడు మృతి చెందారు


చిత్తూరు: చిత్తూరు జిల్ల ఏర్పేడు మండలంం రాజులకండ్రిగలో ఒకే కుటుంబంలోని నలుగురు అనుమానాస్పద స్థితిలో ఆదివారం నాడు మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో ఇద్దరు చిన్పపిల్లలతో పాటు భార్యాభర్తలున్నారు.

శ్రీనివాస్ రెడ్డి, ఆయన భార్య బుజ్జమ్మ, కూతురు భవ్య, కొడుకు నితిన్‌లు  మంటల్లో సజీవ దహనమయ్యారు. ఈ నలుగురు ఎలా చనిపోయారనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇంట్లో గ్యాస్ లీకై ఈ నలుగురు చనిపోయారా.. లేక ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫైరింజన్లు ఇంట్లో మంటలను ఆర్పేశాయి.
గ్యాస్ సిలిండర్ పేలుడు వల్ల  ఈ ఘటన చోటు చేసుకొందా.. లేక ఇతరత్రా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. 

కుటుంబ కలహాల నేపథ్యంలో  ఈ కుటుంబసభ్యులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మూడు మాసాల క్రితమే శ్రీనివాస్ రెడ్డి దంపతులు ఈ గ్రామానికి వచ్చి నివాసం ఉంటున్నారు.

శ్రీనివాస్ రెడ్డి కడప జిల్లాకు చెందినవాడు. బుజ్జమ్మది రాజులకండ్రిగ గ్రామం.  వీరిద్దరూ కూడ ప్రేమ వివాహం చేసుకొన్నారు. కొత్త ఇల్లును కట్టుకొన్నారు. భార్యాభర్తల మధ్య కలహల నేపథ్యం ఉందని పోలీసులు గుర్తించారు. పిల్లలకు మత్తు మందిచ్చి పెట్రోల్ పోసుకొని  ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని పోలీసులు  అనుమానిస్తున్నారు. ఈ విషయమై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 


 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్