ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

Published : Dec 12, 2019, 10:38 AM IST
ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

సారాంశం

ప్రకాశం జిల్లాలో గురువారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. 

ఒంగోలు: ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం కొత్తపల్లిలో గురువారం నాడు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతులంతా కర్ణాటక వాసులుగా పోలీసులు గుర్తించారు.

కర్ణాటకకు చెందిన వారు ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకొందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Government Jobs : తెలుగు యువతా బి రెడీ .. భారీ జాబ్ నోటిఫికేషన్ రాబోతోంది
AP Power Sector : ఏపీకి కొత్త పవర్ ప్లాన్.. తీరనున్న కరెంట్ కష్టాలు..భవిష్యత్ కోసం బ్యాటరీ స్టోరేజ్