అనంతపురంలో విషాదం.. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురి మృతి...

By SumaBala BukkaFirst Published May 28, 2022, 7:46 AM IST
Highlights

అనంతపురంలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించి.. ఇంట్లోని నలుగురు మృతి చెందారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. 
 

అనంతపురం : anathapur district లో విషాదం నెలకొంది. శెట్టూరు మండలం ములకలేడులోని ఓ ఇంట్లో Gas cylinder పేలింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. సిలిండర్ పేలుడు ధాటికి ఇంటి పై కప్పు కూడా కూలింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. 

ఇదిలా ఉండగా, గురువారం ఏపీలోని మదనపల్లెలో ఇలాంటి ప్రమాదమే జరిగింది. మదనపల్లెలో ఘోర రోడ్డు ప్రమాదం.  కారు కల్వర్టును ఢీకొనడంతో.. కారులోని నలుగురు అక్కడికక్కడే మరణించారు. ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. చనిపోయినవారిని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. 

క్రిష్ణాజిల్లాలోనూ ఇలాంటి విషాదమే చోటు చేసుకుంది. పెళ్లికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఈ విషాద ఘటన జిల్లాలోని మోపిదేవి మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెడితే.. చల్లపల్లి మండలంలోని చింతమడ నుంచి పెళ్లి బృందం.. మోపిదేవి మండలం పెడప్రోలు గ్రామంలో జరుగుతున్న పెళ్లి వేడుకలకు  బయలుదేరింది. అయితే, వారు ప్రయాణిస్తున్న వాహనం.. మోపిదేవి మండలం కాశానగర్ వద్ద వాహనం అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. 

ఈ ప్రమాదంలో నలుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం మీద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరకుని  సహాయక చర్యలు చేపట్టారు.  గాయపడిన వారిని అవనిగడ్డ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.  గాయపడిన వారిని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పరామర్శించారు. 

ఇక, ప్రమాదం జరిగిన సమయంలో  పెళ్లి బృందం వాహనంలో 20 మందికి పైగా  ఉన్నారు. పరిమితికి మించి వాహనంలో ప్రయాణిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మృతుల బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా, ఈ నెల 16న అన్నమయ్య జిల్లా కురబలకోట మంలం మదనపల్లి-రాయచోటి ప్రధాన రహదారిమీద మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను లారీ ఢీ కొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మృతులు పెద్దమండ్యం మండలం కలిచర్లకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఒకే కటుంబానికి చెందిన నలుగురు మదరనల్లి నుంచి స్వగ్రామం కలిచెర్లకి వెల్తుండగా ఈ ఘటన జరిగింది. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న ముదివేడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. మృతదేహాలను పోసట్ుమార్టం నిమిత్తం మదనపల్లి ఆసుపత్రికి తరలించారు. ఠాణామిట్ట వద్ద వర్షంలో రోడ్డును క్రాస్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. లారీ ఢీ కొట్టడంతో బైక్ మీద వెడుతున్న నలుగురిలో ముగ్గురు మృతి చెందినట్లు వివరించారు. కాగా, ఈ ఘటనలో బైక్ నుజ్జు నుజ్జు అయ్యింది. మృతదేహాలు కూడా రోడ్డు మీద చెల్లా చెదురుగా పడ్డాయి. 

click me!