జగన్ పీఏ ఫోన్‌ నెంబర్‌తో స్పూఫింగ్: నలుగురు అరెస్ట్

By narsimha lodeFirst Published Jul 28, 2019, 11:41 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ పీఏ సెల్ ఫోన్ నెంబర్ నుతో స్పూఫింగ్ చేసిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ పోలీసులు నిందితులను పీటీ వారంట్ పై అరెస్ట్ చేశారు.

అమరావతి:  ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ వ్యక్తిగత సహాయకుడు కె. నాగేశ్వర్ రెడ్డి వినియోగిస్తున్న సెల్‌ఫోన్  నెంబర్ ను స్పూఫింగ్ చేసిన నలుగురు నిందితులను హైద్రాబాద్  పోలీసులు సైబర్ క్రైమ్ పోలీసులు పీటీ వారంరెట్ పై శనివారం నాడు  అరెస్ట్ చేశారు.

స్పూపింగ్ టెక్నాలజీని ఉపయోగించి అనేక మందికి కాల్స్ చేస్తున్న ఆగంతకులు వైఎస్ జగన్ మాదిరిగా మాట్లాడారు.  ఆపై కొన్ని వాట్సాప్ నెంబర్ల ద్వారా చాటింగ్ కూడ చేశారు.మరో వైపు బీజేపీ ఎంపీ పూనమ్ పేరును డీపీగా వాడుకొన్నారు.

వాయిస్ ఓవర్ ఇంటర్‌నెట్ ప్రొటోకాల్ (వీఓఐపీ) కాల్స్  చేసిన దుండగులు కొందరిని డబ్బులు డిమాండ్ చేశారు. మరికొందరిని తిట్టారు. పలువురితో  వీరంతా ఫోన్లో మాట్లాడారు. ఈ వ్యవహరంపై వైఎస్ఆర్‌సీపీ తీవ్రంగా పరిగణించింది. 2018 డిసెంబర్  మాసంలో హైద్రాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌కు ఫిర్యాదు చేసింది.

ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేశారు. ఏపీ సీఎం జగన్ పీఏ కె. నాగేశ్వర్ రెడ్డి ఉపయోగించిన సెల్‌ఫోన్ నెంబర్  హర్షవర్ధన్ రెడ్డి పేరుతో ఉంది.పార్టీ నేతలతో జగన్ మాట్లాడాలని భావించిన సమయంలో హర్షవర్ధన్ రెడ్డి పేరుతో ఉన్న ఫోన్ నెంబర్ ద్వారా మాట్లాడేవారు.

అయితే ఈ నెంబర్ ను  ఏపీకి చెందిన పండరి విష్ణుమూర్తి, గంగవరపు అరుణ్ కుమార్, పిల్ల రామకృష్ణ,  మార్తాండం, జగదీష్ ముఠాగా ఏర్పడి ఫోన్లో పలువురితో మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు. 

ఈ నలుగురిని ముమ్మిడివరం పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు రాజమండ్రి జైలుకు తరలించారు. హైద్రాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం నాడు పీటీ వారంట్ పై హైద్రాబాద్ కు తీసుకొచ్చారు. అనంతరం జడ్జి ఆదేశాలతో ఆయనను జైలుకు తరలించారు.

click me!