మాజీ మంత్రి గంటాకు షాక్: ప్రత్యూష ఒప్పందం రద్దు

By telugu teamFirst Published Jul 27, 2019, 4:34 PM IST
Highlights

జిల్లా గ్రంథాలయానికి చెందిన ఆ స్థలాన్ని ప్రత్యూషకు లీజుకు ఇస్తూ చేసుకున్న ఒప్పందం ఐదేళ్ల క్రితమే రద్దయిందని బిఎల్ నారాయణ చెప్పారు. అయినప్పటికీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మాత్రం ఇప్పటికీ ప్రత్యూష కంపెనీ పేర ఎన్ కంబ్రెన్ష్ కొనసాగుతోందని చెప్పారు.

విశాఖపట్నం: మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు గంటా శ్రీనివాస రావుకు షాక్ తగిలింది. విశాఖపట్నంలోని మహారాణిపేటలో ఎకరం విస్తీర్ణం గల స్థలాన్ని ప్రత్యూష కంపెనీకి లీజుకు ఇస్తూ చేసుకున్న ఒప్పందం రద్దయిందని పౌర గ్రంథాలయ సేవా సమితి అధ్యక్షుడు బిఎల్ నారాయణ చెప్పారు. 

జిల్లా గ్రంథాలయానికి చెందిన ఆ స్థలాన్ని ప్రత్యూషకు లీజుకు ఇస్తూ చేసుకున్న ఒప్పందం ఐదేళ్ల క్రితమే రద్దయిందని బిఎల్ నారాయణ చెప్పారు. అయినప్పటికీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మాత్రం ఇప్పటికీ ప్రత్యూష కంపెనీ పేర ఎన్ కంబ్రెన్ష్ కొనసాగుతోందని చెప్పారు. గ్రంథాలయ సంస్థ అధికారులు గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ ఒప్పందం రద్దు పత్రాన్ని రిజిస్ట్రార్ కార్యాలయంలో సమర్పించకపోవడమే అందుకు కారణమని అన్నారు 

ఆ స్థలం అప్పట్లో మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాస రావు ఆధీనంలో ఉండడంతో అధికారులు నిర్మాణాలు చేపట్టడానికి ధైర్యం చేయలేదని నారాయణ చెప్పారు. తమ సంస్థ చేసిన ఉద్యమాల కారణంగా ఇప్పటి జెసి సృజన, రాష్ట్ర పౌర గ్రంథాయాల డైరెక్టర్ పి. పార్వతి, కార్యదర్శి పి. ఉదయ్ కుమార్ కు చేసిన సూచనల మేరకు ఒప్పందం రద్దు పత్రం రిజిస్టర్ చేసినట్లు తెలిపారు. దాంతో ప్రత్యూష ఒప్పందం రద్దయిందని చెప్పారు. 

2012లో గ్రంథాలయ స్థలం అన్యాక్రాంతం కావడంపై ఉద్యమం చేపట్టిన ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఎయు) మాజీ వైస్ చాన్సరల్ కెవి రమణ, మాజీ ఐఎఎస్ అధికారి ఇఎఎస్ శర్మ, మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ, ప్రజా స్పందన సభ్యులు సిఎన్ రావు తదితరులు పలు రకాలుగా పోరాటాలు చేసినట్లు ఆయన తెలిపారు 

తన అధికారంతో స్థలాన్ని తనకు అనుకూలంగా తెచ్చుకోవడానికి వేసిన ఐదుగురు సభ్యుల కమిటీ కూడా గంటాకు వ్యతిరేకంగా నివేదిక సమర్పించిందని ఆయన గుర్తు చేశారు  

click me!