నీటికుంటలో పడ్డ చిన్నారి... కాపాడటానికి వెళ్లి, ఒక్కొక్కరిగా ముగ్గురి మృతి

Siva Kodati |  
Published : Feb 04, 2021, 03:25 PM ISTUpdated : Feb 04, 2021, 03:31 PM IST
నీటికుంటలో పడ్డ చిన్నారి... కాపాడటానికి వెళ్లి, ఒక్కొక్కరిగా ముగ్గురి మృతి

సారాంశం

చిత్తూరు జిల్లా కుప్పంలో విషాదం చోటుచేసుకుంది. బట్టలు ఉతికేందుకు వెళ్లిన నలుగురు నీటికుంటలో పడి మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు.. ఇద్దరు మహిళలు ఉన్నారు. 

చిత్తూరు జిల్లా కుప్పంలో విషాదం చోటుచేసుకుంది. బట్టలు ఉతికేందుకు వెళ్లిన నలుగురు నీటికుంటలో పడి మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు.. ఇద్దరు మహిళలు ఉన్నారు.

మండలంలోని చింపనగల్లు గ్రామంలోని నీటికుంటలో బట్టలు ఉతికేందుకు తల్లీ, ఇద్దరు కూతుళ్లతో సహా మరో సమీప బంధువు గురువారం వెళ్లారు. ఈ క్రమంలో కీర్తి (6) అనే చిన్నారి ప్రమాదవశాత్తు నీటికుంటలో పడిపోయింది.

కీర్తిని కాపాడబోయి అక్క హారతి (8) కూడా నీటిలో మునిగిపోయింది. వీరిని కాపాడే క్రమంలో రుక్మిణి (32), సమీప బంధువైన గౌరమ్మ (42) కూడా నీటి కుంటలోకి దిగి మునిగిపోయారు.

అయితే ఉదయం బట్టలు ఉతికేందుకు వెళ్లిన మధ్యాహ్నం కావొస్తున్నా నలుగురు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో చింపనగల్లు నీటికుంటలో నలుగురి మృతదేహాలను గుర్తించారు.

దీంతో చిపనగల్లులో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే