జగ్గయ్యపేటలో రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

Published : Nov 03, 2019, 11:04 AM ISTUpdated : Nov 03, 2019, 11:22 AM IST
జగ్గయ్యపేటలో రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

సారాంశం

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో రోడ్డు ప్రమాదం ఆదివారం నాడు రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది.ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతులంతా మహాబూబ్ నగర్ జిల్లా వాసులుగా గుర్తించారు.


జగ్గయ్యపేట: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్టు వద్ద ఆదివారం నాడు ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

read more  హైదరాబాద్‌లో దారుణం...పురిటిబిడ్డ బ్రతికుండగానే పూడ్చిపెట్టే ప్రయత్నం

అతి వేగంగా వస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డుకు అవతలి వైపు నుండి వస్తున్న మరో కారును ఢీ కొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.ప్రమాద స్థలిలోనే ఇద్దరు మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

 read more  భవన నిర్మాణ కార్మికుడి భార్య అనుమానాస్పద మృతి

హైద్రాబాద్ నుండి కారులో విజయవాడ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది. మృతులంతా ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!