హిందూపురంలో రైలు పట్టాలపై నాలుగు మృతదేహాలు

Published : Oct 15, 2019, 11:25 AM ISTUpdated : Oct 15, 2019, 03:28 PM IST
హిందూపురంలో  రైలు పట్టాలపై నాలుగు మృతదేహాలు

సారాంశం

అనంతపురం జిల్లా హిందూపురంలో రైలు పట్టాలపై నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ మృతదేహాలు సంచలనం సృష్టిస్తున్నాయి.

హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురం రైలు పట్టాలపై నాలుగు మృతదేహాలు కలకలకం రేపాయి. వీరంతా ఆత్మహత్యకు పాల్పడ్డారా, లేక హత్య జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

హిందూపురం రైలు పట్టాలపై నాలుగు మృతదేహాలు పడి ఉన్నాయి. నాలుగు మృతదేహాల్లో రెండు పురుషులవి కాగా, మరో రెండు మృతదేహాలు మహిళలవి.

కిలోమీటరు, రెండు కిలోమీటరు దూరంలో ఈ నాలుగు మృతదేహాలు ఉన్నాయి. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారా లేదా బంధువులా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

మృతుల్లో ఒకరిని దేవరపల్లికి చెందిన ఆదినారాయణగా గుర్తించారు. మృతదేహాలు పడిఉన్న ప్రాంతానికి స్థానికులను తీసుకెళ్లి పోలీసులు విచారణ చేస్తున్నారు. హిందూపురం మండలంలోని  కిటిపి వద్ద రెండు, ములుగూరు వద్ద ఒకటి, దేవరపల్లి వద్ద మరో మృతదేహం లభ్యమైంది. 

కిలోమీటరు, రెండు కిలోమీటర్ల దూరంలో ఈ మృతదేహాలు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. వీరిని ఎక్కడైనా చంపి తీసుకొచ్చి ఇక్కడ వేశారా అనే కోణంలో కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు.ఆత్మహత్యకు పాల్పడ్డారా లేదా హత్య చేశారా అనే కోణంలో కూడ  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం