చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Published : Feb 18, 2022, 12:52 PM IST
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

సారాంశం

చిత్తూరు జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం (road accident) జరిగింది. జిల్లాలోని చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద.. లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. 

చిత్తూరు జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం (road accident) జరిగింది. జిల్లాలోని చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద.. లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనలో కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కావడంతో.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో మృతిచెందిన వారిని విశాఖపట్నం వాసులుగా గుర్తించారు. వీరు విశాఖ నుంచి కాణిపాకం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

మరోవైపు తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో (nagarkurnool district) గత రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని కల్వకుర్తి మండలంలోని  మార్చాల సమీపంలో కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులను అరవింద్‌, శిరీష, కిరణ్మయిగా గుర్తించారు. నల్గొండ జిల్లా కొండమల్లెపల్లికి చెందిన అరవింద్, వర్ధిపట్లకు చెందిన శిరీష, ఖమ్మం జిల్లాకు చెందిన కిరణ్మయి, మిర్యాలగూడ‌కు చెందిన రేణుకలు.. హైదరాబాద్‌లో డిగ్రీ చదువుతున్నారు. వీరు హైదరాబాద్‌లోనే హాస్టల్స్‌లో ఉంటున్నారు. గురువారం వీరు నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దుండ మండలం బండోనిపల్లి గ్రామంలో ఫ్రెండ్ వివాహ విందుకు హాజరయ్యారు. 

వివాహ వేడుకలో పాల్గొన్న అనంతరం గురువారం రాత్రి హైదరాబాద్‌కు తిరిగి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు మార్చాల వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న అరవింద్, శిరీష, కిరణ్మయిలు అక్కడికక్కడే మృతిచెందారు. రేణుకకు తీవ్ర గాయాలయ్యాయి. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన రేణుకను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు