
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు సాయుధ రిజర్వ్ పోలీసులు మరణించారు. నలుగురు ఏఆర్ కానిస్టేబుళ్లు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం శ్రీకాకుళం జిల్లాలోని పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారిపై జరిగింది.
ఆర్మీ జవాన్ అంత్యక్రియలకు ఎస్కార్టుగా బొలెరో వాహనంలో వెళ్లి వస్తుండగా ఆ ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతుండగా బొలేరో వాహనాన్ని లారీ ఢీకొట్టింది. దీంతో ప్రమాదం జరిగింది.
వివరాలు అందాల్సి ఉంది.