ఏపీ రాజధాని వివాదం... హైకోర్టు విచారణ నవంబర్ 26కు వాయిదా

By Arun Kumar PFirst Published Aug 23, 2021, 12:10 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయమై దాఖలైన పిటిషన్లపై సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను నవంబర్ 26కు వాయిదా వేసింది. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంలో దాఖలైన వ్యాజ్యాలపై సోమవారం విచారణ జరిపింది హైకోర్టు. అయితే కరోనా నేపథ్యంలో విచారణను వాయిదా వేయాలన్న పిటిషనర్ల అభ్యర్థన మేరకు విచారణను నవంబరు 15కి వాయిదా వేసింది రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం. 

పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో దాఖలైన అన్ని పిటిషన్లను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఈ ఏడాది మార్చి 26న మొదటిసారి విచారించింది. ఆ తర్వాత మే3 కు వాయిదా వేయగా కరోనా కారణంగా విచారణను ఆగస్ట్ 23కు వాయిదా వేశారు. ఇక ఇవాళ కూడా కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా విచారణను వాయిదా వేయాలని పిటిషనర్లు విజ్ఞప్తి చేశారు. దీంతో నవంబర్ 26కు రాజధాని వ్యాజ్యాలను వాయిదా వేసింది న్యాయస్థానం.   

read more  నకిలీ చలానాల స్కామ్: జగన్ ఆదేశాలు.. కృష్ణాజిల్లాలోని రెండు సబ్‌ రిజిస్ట్రార్ ఆఫీసులపై ఫోకస్

సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ జోయ్‌మల్య బాగ్చీ, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసులపై విచారణ చేపట్టింది. అయితే ఈ నాలుగైదు వారాలు కరోనా విషయంలో అత్యంత కీలకమని కేంద్రం తెలిపిందని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దేశంలో పరిస్థితుల దృష్ట్యా హైకోర్టే నిర్ణయం తీసుకోవాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోరారు. ప్రభుత్వ న్యాయవాదులు కూడా నిర్ణయాన్ని హైకోర్టుకే వదిలేయడంతో విచారణ దాదాపు మూడు నెలల పాటు వాయిదా పడింది. 

click me!