వైసిపిలో చేరనున్న మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి

First Published Aug 31, 2017, 3:29 PM IST
Highlights
  • నంద్యాల ఎన్నిక ఫలితాల ప్రభావం
  • కాంగ్రెస్ నుంచి ఒకరొకరే జారుకుని వైసిపిలో చేరవచ్చు
  • మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి  అదే దారి పడుతున్నారు

నంద్యాల ఎన్నికల్లో వైసిపి వోడిపోయి ఉండవచ్చు గాక, ఆ పార్టీయే ఆంధ్రప్రదేశ్ లో బలమయిన ప్రతిపక్షమని,తెలుగుదేశానికి ధీటయిన పోటీ ఇవ్వగల పార్టీ అని కూడా రుజువయింది.టిడిపి అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డి కూడా చంద్రబాబు కు ధీటైన నాయకుడొకరే  రాష్ట్రంలో, ఆయనే జగన్ అని కూడా అన్నారు. భవిష్యత్తులో రాజకీయాలను నంద్యాలప్రభావితం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ లో ఉన్న నాయకులు వేరే మార్గం చూసుకోవచ్చు. ఇపుడు మాజీ కేంద్ మంత్రి కిల్లీ కృపారాణి  వైసిపిలో చేరబోతున్నదనే వార్తలు వస్తున్నాయి. ఆమె ఒక దఫా వైసిపి నేత జగన్ తో మంతనాలాడినట్లు చెబుతున్నారు. ఆమె సొంతజిల్లా శ్రీకాకుళం ఒకపుడు కాంగ్రెస్ కు కంచుకోట. ఇపుడాపరిస్థితి లేదు. టిడిపి పుంజుకుంది. ఈ పరిస్థితులో టిడిపితో తలపడే శక్తి కాంగ్రెస్ కు లేదని, అది వైసిపి వల్లనే సాధ్యమని ఆమె భావిస్తున్నారని సన్నిహితులు చెబుతున్నారు.

కృపారాణికి జెయింట్ కిల్లర్ అనే పేరుంది.  ఆమె టిడిపి సీనియర్ నాయకుడు ఎర్రన్నాయుడిని వోడించిన కాంగ్రెస్ నాయకురాలు. అందుకే ఆంధ్రనుంచి కొంతమందిని మంత్రిమండలిలోకి తీసుకుకోవాలనుకున్నపుడు ఆమెను ఎంపిక చేశారు. అయితే, 2014 ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ రావు చేతిలో ఆమె డిపాజిట్ కోల్పోయారు.  ఇపుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ లో ఉండి చేయగలిగిందేముందని ఆయన అనుకుంటున్నారట. ఇప్పటికే జిల్లాకు చెందిన ఒక ప్రముఖ నాయకుడు ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ వదలి వైసికి వచ్చారు. అందువల్ల తొందర్లోనే మంచి ముహూర్తం చూసుకుని ఒకరొకరే వైసిపికి వస్తారని, ఇందులో కిల్లి కృపారాణి ఒకరని అంటున్నారు.

 

 

click me!