కాంగ్రెస్‌తో కలవాలనేది ఎన్టీఆర్ చివరి కోరిక: చింతా మోహన్

Published : Nov 05, 2018, 11:14 AM IST
కాంగ్రెస్‌తో కలవాలనేది ఎన్టీఆర్ చివరి కోరిక: చింతా మోహన్

సారాంశం

 కాంగ్రెస్‌కు ద్రోహం చేసిన వైఎస్ జగన్‌ కంటే తమతో కలవాలనుకొంటున్న చంద్రబాబునాయుడు మేలని  తిరుపతి మాజీ ఎంపీ  చింతా మోహన్  అభిప్రాయపడ్డారు


తిరుపతి: కాంగ్రెస్‌కు ద్రోహం చేసిన వైఎస్ జగన్‌ కంటే తమతో కలవాలనుకొంటున్న చంద్రబాబునాయుడు మేలని  తిరుపతి మాజీ ఎంపీ  చింతా మోహన్  అభిప్రాయపడ్డారు.  టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు కలవాలనే నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు.

సోమవారం నాడు ఆయన  మీడియాతో మాట్లాడారు.  టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు కలవాలనేది ఎన్టీఆర్ చివరి కోరికగా ఉండేదని  ఆయన గుర్తు చేశారు.  1995 లో ఎన్టీఆర్  కాంగ్రెస్ పార్టీతో కలవాలనుకొన్నారని  చింతామోహన్ ప్రస్తావించారు.

కాంగ్రెస్‌ పార్టీకి  వైఎస్ జగన్  ద్రోహం చేశారని  ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌కు ద్రోహం చేసిన జగన్‌ కంటే బాబే మేలని  ఆయన అభిప్రాయపడ్డారు.  ఏపీకి ఇచ్చిన హామీలను బీజేపీని విడిచి  కాంగ్రెస్ పార్టీతో టీడీపీ చేరడం శుభపరిణామని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజనకు కారణమని భావించి పార్టీని వీడిన నేతలంతా  తిరిగి  పార్టీలో చేరాలని  ఆయన కోరారు.

సంబంధిత వార్తలు

కాంగ్రెస్‌తో పనిచేయాలని ఎన్టీఆర్ అనుకున్నారు.. పవన్‌ వచ్చినా ఓకే: చింతా మోహన్

 

PREV
click me!

Recommended Stories

సచివాలయం ఉద్యోగులు VS పోలీస్ లు విజయవాడ ధర్నా చౌక్ వద్ద హై టెన్షన్ | Secretariat Employees Dharna
Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజులు దంచికొట్టనున్న వానలు