అలా చేస్తే ఏపీకి జగన్ అన్యాయం చేసినట్టే: ఉండవల్లి అరుణ్ కుమార్

By narsimha lodeFirst Published Dec 7, 2022, 4:17 PM IST
Highlights

రాష్ట్ర విభజన అంశంపై ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో  అభిప్రాయం తెలపాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కోరారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ .

రాజమండ్రి: ఏపీ విభజన సరైందా, కాదా నిర్ణయించాలని సుప్రీంకోర్టును కోరుతున్నానని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. బుధవారంనాడు  మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్  మీడియాతో మాట్లాడారు. అమరావతితో ఏపీ విభజనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర విభజనపై తనతో పాటు 22 మంది పిటిషన్లు దాఖలు చేశారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర విభజనకు అభ్యంతరం లేదని  ఏపీ ప్రభుత్వ లాయర్ సుప్రీంకోర్టులో చెప్పారన్నారు. ఇదంతా సీఎం జగన్ కు తెలిసే  జరుగుతుందా తెలియకుండా జరుగుతుందా అని ఆయన ప్రశ్నించారు.జగన్ కు తెలిసే జరిగితే ఏపీకి జగన్ ద్రోహం చేసినట్టేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు.విభజనలో ఏపీకి జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం తరపున జగన్  సుప్రీంకోర్టుకు తెలపాలన్నారు.ఈ విషయంలో జగన్ మాట్లాడకుంటే  జగన్  కురాజకీయ భవిష్యత్తు లేనట్టేనని ఉండవల్లి అరుణ్ కుమార్  అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర విభజన అన్యాయంగా జరిగిందన్నారు. రాష్ట్ర విభజన బిల్లుపై ఓటింగ్ జరిగే సమయంలో లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే కొట్టారన్నారు. అయితే  ఆ సమయంలో  విభజనకు వ్యతిరేకమని, విభజన జరగనివ్వమని జగన్  చెప్పారని ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆనాడు పార్లమెంట్  బహిష్కరించిన 16 మందిలో జగన్  కూడా ఉన్నారని ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు.రాష్ట్ర విభజన విషయంలో  కౌంటర్  దాఖలు చేయాలని  కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశిస్తే  ఎనిమిదేళ్లైనా కూడా  కేంద్రం కౌంటర్ దాఖలు చేయలేదన్నారు.ఏపీ పునర్విభజన చట్టంలో  ఇచ్చిన హామీలు అమలు కాలేదని  ఉండవల్లి అరుణ్ కుమార్  చెప్పారు. తెలంగాణ, ఏపీని ఇప్పుడు కలపాలని తన ఆలోచన కాదన్నారు. 

click me!