రేవంత్, లోకేష్ పాదయాత్రలతో లాభం లేదు: జేసీ దివాకర్ రెడ్డి సంచలనం

By narsimha lode  |  First Published Feb 8, 2023, 1:17 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  కర్నూల్, అనంతపురం జిల్లాలను  తెలంగాణలో కలపాలని   టీడీపీ నేత, మాజీ ఎంపీ  జేసీ దివాకర్ రెడ్డి కోరారు.  ఇవాళ తెలంగాణ అసెంబ్లీ లోని సీఎల్పీ కార్యాలయానికి ఆయన వచ్చారు. 


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  అనంతపురం,కర్నూల్, జిల్లాలను  తెలంగాణలో  కలపాలని  మాజీ ఎంపీ  జేసీ దివాకర్ రెడ్డి  కోరారు. ఏపీలోని  ఈ రెండు  జిల్లాలను తెలంగాణలో  కలిపితే   అందరికీ  ప్రయోజనమన్నారు.

 బుధవారం నాడు  తెలంగాణ అసెంబ్లీలోని   సీఎల్పీ కార్యాలయానికి  జేసీ దివాకర్ రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా  ఆయన  మీడియాతో మాట్లారు.   రాష్ట్ర విభజన సమయంలో  కూడా  రాయల తెలంగాణ ఏర్పాటు  చేయాలని జేసీ దివాకర్ రెడ్డి  డిమాండ్  చేసిన విషయం తెలిసిందే.   రాయలసీమలోని  జిల్లాలను కూడా తెలంగాణలో కలపాలని  కోరారు. తాజాగా ఇదే డిమాండ్  ను జేసీ దివాకర్ రెడ్డి  లేవనెత్తారు.  

Latest Videos

పాదయాత్రలకు కాలం చెల్లిందని   కూడా  జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.  తెలంగాణలో  టీపపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి,  ఏపీలో  లోకేష్  పాదయాత్రల గురించి ఆయన  ఈ వ్యాఖ్యలు  చేశారు.   రేవంత్ రెడ్డి,  లోకేస్ పాదయాత్రలు  చేసినా  లాభం లేదన్నారు.  ఇప్పుడు మొత్తం డబ్బుతో  కూడిన పాదయాత్రలేనని  జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు  జరిగే సమయంలో  జేసీ దివాకర్ రెడ్డి  వస్తుంటారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలను కలుస్తుంటారు.  అసెంబ్లీ సమావేశాల సందర్భంగా  గతంలో  అధికార పార్టీ  నేతలను కూడా  జేసీ దివాకర్ రెడ్డి కలిసిన విషయం తెలిసిందే. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో జేసీ దివాకర్ రెడ్డి కొనసాగారు.  రాష్ట్ర విభజనకు ముందు  జేసీ దివాకర్ రెడ్డి ఆయన సోదరుడు  జేసీ ప్రభాకర్ రెడ్డిలు  కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో  చేరారు.  2014 ఎన్నికల్లో అనంతపురం పార్లమెంట్ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా  పోటీ చేసి   జేసీ దివాకర్ రెడ్డి   విజయం సాధించారు. తాడిపత్రి  అసెంబ్లీ స్థానం నుండి   జేసీ ప్రభాకర్ రెడ్డి పోటీ చేసి గెలుపొందారు.  2019 ఎన్నికల్లో  అనంతపురం నుండి  జేసీ దివాకర్ రెడ్డి తనయుడు పవన్ కుమార్ రెడ్డి, తాడిపత్రి నుండి అస్మిత్ రెడ్డి  పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
 

click me!