నెల్లూరులో టీడీపీ vs వైసీపీ : పోలీస్ స్టేషన్ వద్ద ఘర్షణ.. తెలుగుదేశం మహిళా నేతపై దాడి, ఉద్రిక్తత

Siva Kodati |  
Published : May 22, 2022, 06:01 PM IST
నెల్లూరులో టీడీపీ vs వైసీపీ : పోలీస్ స్టేషన్ వద్ద ఘర్షణ.. తెలుగుదేశం మహిళా నేతపై దాడి, ఉద్రిక్తత

సారాంశం

నెల్లూరు జిల్లాలో అక్రమ లేఔట్ల వ్యవహారంపై టీడీపీ- వైసీపీ శ్రేణుల మధ్య గత కొన్ని రోజులుగా మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం సంతపేట పోలీస్ స్టేషన్ వద్ద ఇరు పార్టీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో తెలుగుదేశం మహిళా నేత రేవతి సొమ్మిసిల్లి కిందపడిపోయారు.   

నెల్లూరు (nellore) సంతపేట పోలీస్ స్టేషన్ వద్ద వైసీపీ , టీడీపీ నేతల (ycp tdp clash) మధ్య ఘర్షణ జరిగింది. వాగ్వాదంలో టీడీపీ మహిళా నేత రేవతి (revathi) సొమ్మసిల్లి పడిపోయారు. నెల్లూరు నగరంలో గత కొన్ని రోజులుగా అక్రమ లేఔట్లపై వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య వివాదం నెలకొంది. ప్రధాన నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా ఆదివారం ఈ వివాదం ఉద్రిక్తతలకు దారి తీసింది. 

ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై (anil kumar yadav) శనివారం నెల్లూరు నగర టీడీపీ  బీసీ సెల్ అధ్యక్షురాలు రేవతి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీంతో వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కొందరు టీడీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. రేవతి పోలీస్ స్టేషన్‌కు రాగా..  అప్పటికే అక్కడున్న వైసీపీ నేతలతో మాటా మాటా పెరిగి, ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనలో రేవంతి సొమ్మసిల్లి పడిపోయారు. అయితే తమ పార్టీ కార్యకర్తలను దూషించినందుకే తాము ప్రశ్నించామని, వైసీపీ నేతలు అంటున్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్