అత్యాచారాల్లో యూపీ తర్వాత ఏపీనే: మాజీ ఎంపీ హర్షకుమార్ సీరియస్ కామెంట్స్

By narsimha lode  |  First Published Oct 2, 2020, 12:37 PM IST

అత్యాచారాల్లో యూపీ తర్వాత ఏపీ రాష్ట్రం నిలిచిందని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. అర్ధరాత్రి మహిళలు రోడ్లపై స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి వచ్చినప్పుడే నిజమైన స్వాతంత్ర్యమని గాంధీ అన్న మాటలను ఆయన గుర్తు చేశారు. ఆ పరిస్థితులు దేశంలో ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు.


అమలాపురం: అత్యాచారాల్లో యూపీ తర్వాత ఏపీ రాష్ట్రం నిలిచిందని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. అర్ధరాత్రి మహిళలు రోడ్లపై స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి వచ్చినప్పుడే నిజమైన స్వాతంత్ర్యమని గాంధీ అన్న మాటలను ఆయన గుర్తు చేశారు. ఆ పరిస్థితులు దేశంలో ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు.

శుక్రవారం నాడు అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోఅజయ్ అనే యువకుడిని యజమాని పార్శిల్ వస్తోందని చెబితే తీసుకువచ్చాడని.. ఆ పార్శిల్ లో ఏముందో అతనికేం తెలుసునని ఆయన ప్రశ్నించారు. పోలీసులు అజయ్ ను హింసించారని ఆయన ఆరోపించారు. 

Latest Videos

undefined

దేశంలో ప్రతి రోజూ సుమారు 91 మంది మహిళలపై అత్యాచారాలు చోటు చేసుకొంటున్నాయని ఆయన చెప్పారు.  అత్యాచారాల్లో యూపీ రాష్ట్రం తర్వాత ఏపీ రాష్ట్రం నిలిచిందన్నారు. 

హత్రాస్ లో  మరణించిన బాధితురాలిపై అత్యాచారం జరగలేదని చెప్పడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులకు చెప్పకుండానే పోలీసులు హత్రాస్ బాధితురాలి అంత్యక్రియలు నిర్వహించడంపై ఆయన మండిపడ్డారు.

ప్రభుత్వం ముద్దాయిల తరపున వ్యవహారించడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. హత్రాస్ కు వెళ్తున్న రాహుల్ , ప్రియాంకలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఆయన ఖండించారు.
 

click me!