వైఎస్ షర్మిలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్నాం: మాజీ ఎంపీ చింతా మోహన్

By narsimha lodeFirst Published Jul 10, 2023, 3:16 PM IST
Highlights


వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీలోకి  ఆహ్వానిస్తున్నామని మాజీ ఎంపీ  చింతా మోహన్ చెప్పారు. 

న్యూఢిల్లీ: వైఎస్ షర్మిలను  కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నేత చింతా మోహన్  చెప్పారు.సోమవారంనాడు చింతామోహన్  న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  రాజకీయం మారిపోయిందన్నారు.  పార్టీలోకి ఎవరొచ్చినా వారిని ఆహ్వానిస్తామన్నారు.  చిన్న మాట అంటేనే  రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారన్నారు.మాజీ మంత్రి వైఎస్    వివేకా హత్య  జరిగి ఇప్పటికీ  నాలుగేళ్లు అవుతున్నా  ఎవరికీ శిక్షపడలేదన్నారు. వైఎస్ జగన్ సర్కార్ లో అవినీతి పెరిగిపోయిందని ఆయన ఆరోపించారు. 2024 ఎన్నికల్లో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీకి  20 సీట్ల కంటే ఎక్కువ రావడం కూడ కష్టమేనన్నారు. 

also read:కాంగ్రెస్‌లోకి రాజన్న బిడ్డ .. వారెంతో షర్మిల కూడా అంతే, నెత్తిన పెట్టుకోలేం : చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు

వారం రోజుల క్రితం  వైఎస్ షర్మిల గురించి  చింతా మోహన్ మరో రకంగా వ్యాఖ్యలు  చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని  నెత్తిన పెట్టుకొని  కాంగ్రెస్ తప్పు  చేసిందన్నారు.  మరోసారి అలాంటి పొరపాటు  చేయదలుచుకోలేదన్నారు.  గతంలో సీఎంలుగా పనిచేసిన  కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డిలకు  కూడ కూతుళ్లున్నారన్నారు. వారంతా కాంగ్రెస్ లో చేరవచ్చన్నారు. వారెంతో  షర్మిల కూడ అంతేనన్నారు. షర్మిలను నెత్తిన పెట్టుకోబోమన్నారు.   

గత కొంత కాలంగా  వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే  ప్రచారం కూడ సాగుతుంది.   ఈ ప్రచారాన్ని  వైఎస్ షర్మిల  ఖండించారు. వైఎస్ఆర్‌టీపీని  ఏ పార్టీలో కూడ విలీనం చేయబోమని ఆమె ప్రకటించారు. కర్ణాటక  డిప్యూటీ సీఎం  డీకే శివకుమార్ తో  వైఎస్ షర్మిల  భేటీ కావడం కూడ  ఈ ప్రచారానికి ఊతమిచ్చేలా ఉందనే  అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

click me!