విశాఖపట్టణం జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు టీడీపీకి గుడ్ బై చెప్పారు. మూడు రాజధానులను టీడీపీ వ్యతిరేకించడాన్ని ఆయన తప్పుబట్టారు.
విశాఖపట్టణం: విశాఖపట్టణం జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు టీడీపీకి గుడ్ బై చెప్పారు. మూడు రాజధానులను టీడీపీ వ్యతిరేకించడాన్ని ఆయన తప్పుబట్టారు.
బుధవారం నాడు విశాఖపట్టణంలో పంచకర్ల రమేష్ బాబు మీడియాతో మాట్లాడారు. విశాఖపట్టణాన్ని వాణిజ్య రాజధానిని చేయాలని చెప్పడం సరికాదన్నారు.అమరావతి ప్రాంత రైతులకు న్యాయం చేస్తూ విశాఖను రాజధాని చేస్తే తప్పేమీటని ఆయన చంద్రబాబునాయుడును ప్రశ్నించారు.
పార్టీకి నష్టం చేసిన వారే చంద్రబాబు చుట్టూ ఉన్నారని పార్టీ కోసం పనిచేసే వారి గురించి పట్టించుకోవడం లేదన్నారు. అమరావతిని రాజధానిగా ప్రకటించిన సమయంలో తాము ఒప్పుకొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
విశాఖపట్టణం జిల్లా పార్టీలో కొన్ని రోజులుగా సాగుతున్న పరిణామాలపై ఆయన పార్టీ అధిష్టానం తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. విశాఖ వాణిజ్య రాజధానిని వ్యతిరేకించడంతో స్థానికంగా తమకు ఎదురౌతున్న ఇబ్బందుల గురించి కూడ పార్టీ నాయకత్వానికి వివరించినట్టుగా పంచకర్ల రమేష్ బాబు మీడియాకు చెప్పారు.
Also read:బాబుకు షాక్, మాట మార్చిన రామసుబ్బారెడ్డి: రేపు జగన్ సమక్షంలో వైసీపీలోకి
మూడు రోజులుగా చంద్రబాబుకు తాను ఈ విషయాలన్నీ చెప్పినా కూడ ఆయన పట్టించుకోలేదన్నారు. ఈ కారణంగానే పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకొన్నానని ఆయన తెలిపారు. పార్టీ కోసం పనిచేసే వారి కోసం కాకుండా పార్టీకి నష్టం చేసే వారికే చంద్రబాబు పెద్ద పీట వేస్తున్నారని చంద్రబాబుపై పంచకర్ల మండిపడ్డారు.
2014 ఎన్నికల్లో విశాఖపట్టణం జిల్లా యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పంచకర్ల రమేష్ బాబు పోటీ చేసి విజయం సాధించాడు. 2019 ఎన్నికల్లో ఇదే స్థానం నుండి ఆయన పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.
వేరే ప్రాంతం నుండి వచ్చిన తనను విశాఖ అదరించిందని ఆయన చెప్పారు. ఇటీవల విశాఖ ను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించడంతో విశాఖ నాయకులు గా తాము స్వాగతించామని, అదే విషయం చంద్రబాబుకు చెప్పాం గానీ అమరావతే రాజధానిగా పోరాటం చేయ్యమన్నారని పంచకచర్ల రమేష్ చెప్పారు. అమరావతి రాజధాని గా తానును పోరాటం చేయలేదని టిడిపి రూరల్ అధ్యక్షుడు గా ఉన్న తనను ఇబ్బందులు పెడుతున్నారని, అందుకే టిడిపికి రాజీనామా చేస్తున్నానని ఆనయ అన్నారు.
రాజకీయంగా తనను అక్కున చేర్చుకున్న విశాఖను తాను గౌరవిస్తున్నానని, అందుకే విశాఖ రాజధానిగా స్వాగతిస్తున్నానని ఆయన అన్నారు. టిడిపి ఓటమికి కారకులే మళ్ళీ ఇప్పుడు చంద్రబాబుకు మళ్లీ సలహాలు ఇస్తున్నారని ఆయన అన్నారు. ఇటీవల లోకేష్ హైదరాబాద్ లో కొంతమంది యువనేతలు విందు ఇచ్చారని ఆయన గుర్తు చేసారు. తనను పోమ్మనలేక పోగ పెడుతున్నారని, గతంలో అనేక తప్పులు చేశామని,
పక్క పార్టీ వ్యక్తులను తీసుకోని మంత్రి పదవులు ఇచ్చారని ఆయన అన్నారు. చంద్రబాబు తనయుడు లోకేష్ కు ప్రజా బలంతో గెలవకున్నా కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ని చేశారని, ఇవన్నీ ప్రజలకు నచ్చలేదని, అందుకే 23 సీట్లు ఇచ్చారని ఆయన అన్నారు.