ఉరి తీయండి, వారికి దండం పెడితే కేసులు ఉండేవి కావు: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలనం

By narsimha lode  |  First Published Aug 7, 2020, 12:54 PM IST

క్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహరంలో మా సంతకాలు ఉంటే తనను ఉరి తీయాలని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు.
శుక్రవారం నాడు ఓ తెలుగు న్యూస్ ఛానెల్ కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను ఆయన వెల్లడించారు.


అనంతపురం: అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహరంలో మా సంతకాలు ఉంటే తనను ఉరి తీయాలని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు.
శుక్రవారం నాడు ఓ తెలుగు న్యూస్ ఛానెల్ కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను ఆయన వెల్లడించారు.

తాను వాళ్లకు నమస్కారం పెడితే ఈ కేసు ఉండకపోయేది, నమస్కారం పెట్టలేకపోవడంతోనే తనపై కేసు పెట్టారని ఆయన పరోక్షంగా వైసీపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాము టీడీపీని వీడుతామని సాగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. గత ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ ను వీడే సమయంలోనే చాలా బాధపడినట్టుగా ఆయన గుర్తు చేసుకొన్నారు. అప్పుడు అనివార్య పరిస్థితుల్లోనే కాంగ్రెస్ ను వీడినట్టుగా ఆయన చెప్పారు.

Latest Videos

undefined

ఎవరైనా ఏదైనా మాట్లాడుకోవచ్చు.. వాటికి తాను సమాధానం చెప్పనన్నారు. తాము టీడీపీలోనే కొనసాగుతామన్నారు. పార్టీ మారితే ఈ కేసులు  ఉండకపోయేవిగా ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు. పార్టీలు మారే బదులుగా ఖాళీగా ఇంట్లో కూర్చొంటామని ఆయన తేల్చి చెప్పారు.

మంచి పనిచేసినా... చెడ్డ పని చేసినా కూడ జైల్లో వేస్తారని ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కొందరు ఉద్దేశ్యపూర్వకంగానే తమపై కేసులు పెట్టించారని ఆయన ఆరోపించారు. పోలీసులపై తాను ఆరోపణలు  చేయడం లేదన్నారు. పోలీసులపై ప్రభుత్వం ఒత్తిడి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో పోలీసులు కూడ ఏమీ చేయలేరని ఆయన చెప్పారు. 

ఎన్టీఆర్ హయంలో 11 రోజులు, జగన్ హయంలో 54 రోజుల పాటు జైల్లో గడిపినట్టుగా ఆయన గుర్తు చేసుకొన్నారు. ఎన్టీఆర్ పై పోటీ చేసిన సమయంలో పీడీ యాక్టు పెట్టి 11 రోజులు జైల్లో ఉంచారన్నారు. ఆ సమయంలో జైలు అధికారులు బాగా చూసుకొన్నారని ఆయన చెప్పారు. 

ఈ కేసులను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. అధికారంలో ఉన్న వారు ఎన్ని కేసులైనా పెట్టే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్లో తమ పాత్ర లేదన్నారు. ఏజంట్లదే పూర్తి బాధ్యత అని ఆయన చెప్పారు. ఇంజన్ నెంబర్, చాసీస్ నెంబర్ ను ఆన్ లైన్ లో విచారిస్తే యూరో 3 లేదా యూరో 4 వాహనం సులభంగా తెలిసే అవకాశం ఉందని చెప్పారు.
 

click me!